‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.. బొమ్మ దద్దరిల్లిపోద్ది- సూపర్‌స్టార్‌ మహేష్‌

0
208

‘భరత్ అనే నేను’, ‘మహర్షి’లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భాంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ ఇంటర్వ్యూ…

★ ‘సరిలేరు నీకెవ్వరు’ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది?
అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. ‘ఎఫ్‌2’ జరిగేటప్పుడు అనిల్‌ రావిపూడి నాకు 40 మినిట్స్‌ కథ చెప్పారు. చాలా బాగుంది. ప్రస్తుతం ఒక సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. దాని తర్వాత చేస్తాను అని చెప్పాను. కానీ ‘ఎఫ్‌2’ చూడగానే ఇమ్మీడియెట్‌గా ఈ సినిమా చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఈ స్టోరిలైన్‌ నాకు ఎగ్జయిటింగ్‌గా అన్పించింది. ‘శ్రీమంతుడు’ నుంచి సెపరేట్‌ జోనర్‌లో మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తున్నాను. ‘దూకుడు’లాంటి ఒక కమర్షియల్‌ ఫిల్మ్‌ నా నుండి రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అలాగే నేనూ అనుకుంటున్నాను. ‘ఎఫ్‌2’ చూడగానే ఈ కథకి రిలేట్‌ అయి ‘మహర్షి’ సినిమా తర్వాత ఈ కథ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అలా జూలైలో సినిమా స్టార్ట్‌ చేశాం. డిసెంబర్‌లో షూటింగ్‌ పూర్తయింది. నా కెరీర్‌లో తీసుకున్న వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ డెసిషన్‌ ఈ టైమ్‌లో ఈ సినిమా చేయడం.

★ సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారా?
బొమ్మ దద్దరిల్లిపోద్ది. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాను. సినిమా మొదలైన తొలి రోజు నుంచి ఇప్పటిదాకా అదే వైబ్‌ని ఫీల్‌ అవుతున్నాను. నిర్మాతలు ఫస్ట్‌ కాపీ చూసినప్పుడు కూడా అదే ఫీలయ్యారు. బ్లాక్‌ బస్టర్‌ రాబోతుందని ముందుగా తెలిసినప్పుడే అలా జరుగుతుంది.

★ ఈ సినిమాని తొందరగా పూర్తి చేశారు కదా! భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ చేస్తారా?
‘బిజినెస్‌మేన్‌’ తర్వాత తొందరగా పూర్తి చేసిన సినిమా ఇది. ఈ కథ అనుకున్నప్పుడే జూన్‌లో స్టార్ట్‌ చేసి సంక్రాంతికి వద్దామనుకున్నాం. ఎందుకంటే సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌. ఆర్మీ మేజర్‌ రోల్‌ చేస్తున్నాం కాబట్టి ఫిట్‌గా కనబడాలని కొంచెం టైమ్‌ తీసుకొని రెడీ అయ్యాను. అలా జూలైలో షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. అప్పటి నుండి 125 రోజుల్లో మా యూనిట్‌ రెస్ట్‌ లేకుండా కంటిన్యూగా వర్క్‌ చేశారు.
టీమ్‌ ఎఫర్ట్‌ వల్లే అనుకున్న సమయానికి సినిమా రెడీ అయ్యింది.

★ ఎంటర్‌టైన్‌మెంట్‌ని, దేశ భక్తిని బ్లెండ్‌ చేసి సినిమా చేయడం ఎలా అన్పించింది?
అదే మా దర్శకుడు అనిల్‌ రావిపూడి బలం. ఆర్మీ ఆఫీసర్‌ సబ్జెక్ట్‌ తీసుకొచ్చి దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ మిక్స్‌ చేసి దానికి హీరోయిజం జత చేసి సినిమా చేయడం జోక్‌ కాదు. సేమ్‌ టైమ్‌ రెస్పాన్సిబుల్‌ క్యారెక్టర్‌ని ఇష్టంవచ్చినట్లు తెరపై చూపించలేం. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు రావిపూడి. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలతో పోలిస్తే ఇది డిఫరెంట్‌ మూవీ.

★ కథ వినేటపుడు ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు?
సాధారణంగా నేను కథ వినేటప్పుడే డైరెక్టర్‌ని బాగా నమ్ముతాను. ఏ డైరెక్టర్‌తోనైనా ట్యూన్‌ అవ్వడం చాలా ఇంపార్టెంట్‌. ఒకసారి కథ నచ్చితే డైరెక్టర్‌ చెప్పినట్లు వింటాను. అనిల్‌కి చాలా క్లారిటీ ఉండటం వల్ల నా క్యారెక్టర్‌ని చేయడం నాకు చాలా ఈజీ అయ్యింది. ‘దూకుడు’ తర్వాత ఒక కంఫర్టబుల్‌ జోనర్‌ నుండి బయటికి వచ్చి ఇలాంటి సినిమా చేయడం నాకు కొత్తగా అన్పించింది. అలాగని దూకుడులాగా చేయలేను. కమర్షియల్‌ ఫార్మెట్‌లో ఫ్రెష్‌గా పెర్‌ఫార్మెన్స్‌ చూపించాలి.

 ★ కామెడీ పరంగా, డ్యాన్స్‌ పరంగా ఈ సినిమాకి ఎక్కువ శ్రమపడ్డారా?

అనిల్‌ రావిపూడి సినిమా అనగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ పీక్‌లో ఉంటుంది. నేను కొత్త టైమింగ్‌ పట్టుకోవాలి. అనిల్‌ కూడా నా ‘దూకుడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలన్నీ చూసి, నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు వేరే మీటర్‌లో ఉండేలా ఈ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు. అలాగే ఈ సినిమాలో మాస్‌ సాంగ్‌కి స్కోప్‌ ఉంది. శేఖర్‌ మాస్టర్‌కి ఆ క్రెడిట్‌ ఇవ్వాలి.

★ ఇప్పటివరకూ మీరు చేసిన సినిమాల్లో ఇదెలా డిఫరెంట్‌గా ఉండబోతోంది?
– నేను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా మరో డైమెన్షన్‌లో ఉంటుంది. ముఖ్యంగా నా ఫ్యాన్స్‌ కంప్లీట్‌గా కొత్త మహేశ్‌ని చూస్తారు. అలాగే కొత్త టైమింగ్‌, చాలా సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి.

పర్టిక్యులర్‌గా ఈ స్క్రిప్ట్‌ని సెలెక్ట్‌ చేసుకోడానికి రీజన్‌ ఏంటి?

ఓపెన్‌గా, ఫ్రీగా ఉండే ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేయాలనుకున్నాను. కథకి ప్రాముఖ్యతనిచ్చి యాక్ట్‌ చేసిన ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలకి భిన్నంగా కమర్షియల్‌ ఫార్మెట్‌లో ఉండి పెర్‌ఫార్మెన్స్‌ చేస్తూ ‘దూకుడు’ తరహాలో ఉండే స్క్రిప్ట్‌ కోసం చూసే సమయంలో ఈ స్క్రిప్ట్‌ దొరికింది. సాధారణంగా కథకి ఇంపార్టెన్స్‌ ఇస్తాను. కథ విన్నప్పుడు నాకు ఎగ్జయిటింగ్‌గా అన్పించాలి. ఈ కథ విషయంలో కూడా నాకు ఎగ్జయిటింగ్‌ అన్పించింది. అందుకే ఈ సినిమా చేశాను.

కొండారెడ్డి బురుజు సెట్‌ దగ్గర చేయడం సెంటిమెంట్‌గా అన్పించిందా?
అనిల్‌ కథ చెప్పేటప్పుడు కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది అని చెప్పారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు ఫేమస్‌ ప్లేస్‌. ఈ సినిమాలో అది ఒక పాత్ర పోషించింది. ‘ఒక్కడు’ సినిమాలో నేను చేసిన కొండారెడ్డి బురుజు సీన్‌ ఒక ఐకాన్‌ అయింది. మళ్ళీ ఈ సినిమాలో భాగంగా కొండారెడ్డి బురుజు సెట్‌ వేయడం చాలా హ్యాపీగా అన్పించింది. ఆ క్రెడిట్‌ మొత్తం ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌కే దక్కుతుంది. కొండారెడ్డి బురుజు సెట్‌ని యాజిటీజ్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీలో దింపేశాడు. ఫస్ట్‌రోజు ఆ సెట్‌ చూడగానే ‘ఒక్కడు’ రోజులు గుర్తుకొచ్చాయి.

కథా పరంగా కొత్తగా ఉంటుందా? లేక ట్రీట్‌మెంట్‌ పరంగా కొత్తగా ఉంటుందా?
కమర్షియల్‌ సినిమాల్లో ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రేక్షకులు చాలా థ్రిల్‌గా, ఎగ్జయిట్‌గా ఫీలవుతారు.

ఆర్మీ మేజర్‌ పాత్ర కోసం ఎలా ప్రిపేర్‌ అయ్యారు?
ప్రత్యేకమైన ఎక్సర్‌సైజ్‌లు ఏమీ చేయలేదు కానీ డైట్‌ విషయంలో కేర్‌ తీసుకొని 6 కిలోల బరువు తగ్గాను. ఆర్మీ మేజర్‌ అనగానే చూసే ప్రేక్షకులకి కన్విన్సింగ్‌గా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత ఫిట్‌గా తయారయ్యాను.

చాలాకాలం తర్వాత విజయశాంతితో మళ్లీ వర్క్‌ చేయడం ఎలా అన్పించింది?
అమేజింగ్‌ ఫీలింగ్‌. ఆమెతో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫ్లైట్‌లో కలిశాం తప్ప టచ్‌లో లేను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్‌డే షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ చేస్తున్నాను అనే ఫీల్‌ ఉంది. కానీ ఒక షాట్‌ చేయగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్‌ నిన్ననే జరిగినట్లు అన్పించింది. ఆవిడ తప్ప ఈ క్యారెక్టర్‌ని అంత బాగా ఎవరూ చేయలేరు. ఆమె ఈ క్యారెక్టర్‌ చేయడం ఈ సినిమాకి, మా టీమ్‌కి పెద్ద అడ్వాంటేజ్‌ అయ్యింది. ఆమెకి ఈ సందర్భంగా థాంక్స్‌ తెలియజేస్తున్నా.

ఈ సినిమాలో కృష్ణగారు కనిపిస్తారు అని దర్శకుడు అనిల్‌ చెప్పారు?
అది సినిమాలో ఒక సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. మా అందరికి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది.

సినిమాలో మీకు బాగా నచ్చిన పాట?
ఫస్ట్‌ వచ్చే థీమ్‌ సాంగ్‌. ఆ పాటని దేవీ అద్భుతంగా రాశారు. తర్వాత ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్‌.

ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌ ఉంది కదా? అది ఎవరి ఛాయిస్‌?
అనిల్‌ రావిపూడిగారిదే. స్టోరి నేరేషన్‌ చేసేటప్పుడే ఈ క్యారెక్టర్‌కి వీళ్ళు కావాలి అని చెప్పారు. వాళ్లు నటిస్తానంటే నాకూ ఓకే అన్నాను. ఈ సినిమాకి అలా మంచి క్యాస్టింగ్‌ కుదిరింది.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవిగారు మిమ్మల్ని అప్రిషియేట్‌ చేయడం ఎలా అన్పించింది?
చిరంజీవిగారు నన్నెప్పటి నుండో సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. ‘ఒక్కడు’ సినిమా ఆయనకు విపరీతంగా నచ్చి నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ‘అర్జున్‌’ సినిమా కోసం మధురమీనాక్షి టెంపుల్‌ సెట్‌ వేశాం. ఆయన స్వయంగా ఆ సెట్‌కి వచ్చి చాలాసేపు గడిపారు. మీలాంటి వాళ్లు ఇలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది అన్నారు. ఆయన నాకెప్పటికీ ఇన్‌స్పిరేషనే. అలాగే ‘పోకిరి’ సినిమా చూసి జగన్‌గారి ఆఫీస్‌ నుండి నాకు కాల్‌ చేసి రమ్మని, దాదాపు మూడు గంటల సేపు ఆ సినిమా గురించి మాట్లాడారు. అప్పటి నుండి ఏ సినిమా రిలీజై హిట్టయినా ఆయన్నుండే ఫస్ట్‌ ఫోన్‌ కాల్‌ వస్తుంది. అందుకే ఫంక్షన్‌లో జనవరి 11న ఫస్ట్‌ ఫోన్‌ కాల్‌ ఆయన నుండే రావాలని కోరుకుంటున్నానని చెప్పాను. చిరంజీవిగారిని ఆహ్వానించడం అనేది నా ఐడియానే. ఇలా ఫంక్షన్‌ అనుకుంటున్నాం. మీరు రావాలి అనగానే, వెంటనే తప్పకుండా వస్తాను అని మెసేజ్‌ పెట్టారు.

అదే వేదికపై నాన్నగారికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరారు కదా?
నాన్నగారిని కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చింది. నాన్న గారు.. చిరంజీవి చాలా బాగా మాట్లాడారు థాంక్స్‌ చెప్పానని చెప్పు అన్నారు. నిజంగా నాన్నగారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ.

కృష్ణగారు సినిమా చూశారా?
లేదండి. ఆయన జనవరి 11న చూస్తారు.

1000 మంది పిల్లలకి హార్ట్‌ ఆపరేషన్‌ చేయించారు కదా?
రెండు మూడు సంస్థలతో కలిపి ఆపరేషన్స్‌ చేయించాం. ఆంధ్రా హాస్పిటల్స్‌, హీల్‌ ఎ ఛైల్డ్‌ లాంటి సంస్థలతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేస్తాం.

ఫ్యాన్స్‌కి పాజిటివ్‌ సంకేతాలు ఇవ్వడంలో మీరెప్పుడూ ముందుంటారు?
అది చాలా మంచి ట్రెండ్‌. అలాగే పాజిటివ్‌ సైన్‌. దాని వల్ల అందరిలోనూ గుడ్‌ వైబ్స్‌ ఏర్పడతాయి. ఆరోజు ఫంక్షన్‌లో కూడా చిరంజీవిగారు, విజయశాంతిగారు మాట్లాడేటప్పుడు మా యూనిట్‌కి చాలా హ్యాపీగా అన్పించింది.

రష్మిక మందన్నాతో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌?
ఆ క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఒక ఫ్రెష్‌ ఫేస్‌ మాకు కావాలనుకొని ఆమెను సెలెక్ట్‌ చేసుకున్నాం. బ్రిలియంట్‌ ఛాయిస్‌. ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. షి ఈజ్‌ వెరీ టాలెంటెడ్‌.

పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది కదా! బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎలా ఉండబోతోంది?
దేవి నా పర్సనల్‌ ఫేవరేట్‌. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ దేవి చేస్తున్నాడంటే నాకు చాలా హ్యాపీగా అన్పిస్తుంది. ఎందుకంటే అంత రెస్పాన్స్‌బుల్‌గా ఉంటారు. అందులోనూ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌. ఏ సీన్‌ ఎక్కడ స్టార్ట్‌ అవ్వాలి, ఎక్కడ ఎండ్‌ అవ్వాలి అనేది పర్‌ఫెక్ట్‌గా చేస్తారు. ఈ సినిమాకి తన బెస్ట్‌ ఇచ్చారు.

మీకు నచ్చిన డైరెక్టర్లని రిపీట్‌ చేస్తారు కదా! అనిల్‌ రావిపూడితో మళ్లీ చేస్తారా?
డెఫినెట్‌గా చేస్తాను. ఈ సినిమా చేసిన తర్వాత అనిల్‌ రావిపూడి అంటే నాకు విపరీతమైన ఇష్టం ఏర్పడింది. దర్శకుల్లో అలాంటి ఎనర్జీ నేను చూడలేదు. ఎంత టెన్షన్‌ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సెట్‌లో నవ్వుతూ ఉంటారు. నేనింతవరకూ అలా ఎవర్నీ చూడలేదు. మా టీమ్‌ అంతా టెన్షన్‌గా ఉన్నప్పుడు అనిల్‌ మాత్రం చిన్న డ్యాన్స్‌ వేస్తూ నవ్విస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ అయిదు నెలల్లో పూర్తి చేశాడంటే నాకే సర్‌ప్రైజింగ్‌గా ఉంది.

రత్నవేలు ఫొటోగ్రఫీ గురించి చెప్పండి?
15 రోజులు కాశ్మీర్‌లో రెక్కీ చేసి షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. సినిమా ఇంత ఫాస్ట్‌గా కంప్లీట్‌ అయ్యిందంటే రత్నవేలుగారు కూడా ఒక కారణం. సినిమా క్వాలిటీ విషయంలో కానీ, విజువల్స్‌ విషయంలో కానీ ఆయన వర్క్‌ అమేజింగ్‌.

నిర్మాత అనిల్‌ సుంకర గురించి ?
ఈ సినిమాని అనిల్ గారితో దిల్ రాజు గారి సమర్పణలో జి.ఎం.బి నిర్మించడం హ్యాపీ.
అనిల్‌ సుంకరగారు ఒక ఫ్యామిలీ మెంబర్‌లాంటివారు. ‘దూకుడు’ దగ్గర్నుంచి నేను చూస్తున్నాను. నాన్నగారంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. అలాగే మా ఫ్యామిలీ అన్నా ప్రత్యేక గౌరవం. ఒక హీరోలా కాకుండా ఫ్యామిలీ మెంబర్‌లా ట్రీట్‌ చేస్తారు.
ఆయన ఫస్ట్‌కాపీ చూసి ఎగ్జయిట్‌ అయి మెసేజ్‌ పెట్టారు. చాలా హ్యాపీగా అన్పించింది.

ఫైట్స్‌ గురించి?
– నా ఫేవరేట్‌ ఫైట్‌ మాస్టర్స్‌. ఇందులో రెండు మూడు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇరగ్గొట్టేశారు. అన్ని ఫైట్స్‌ దేనికదే కొత్తగా ఉండేలా డిజైన్‌ చేశారు. మా కాంబినేషన్‌లో ఇవి బెస్ట్‌.

మీ నెక్స్‌ట్‌ సినిమా?
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు గారితో సినిమా ఉంటుంది. వంశీ చెప్పిన స్క్రిప్ట్‌ చాలా ఎగ్జయిటింగ్‌గా అన్పించింది. టోటల్ కమర్షియల్‌ ఫార్మెట్‌లో ఉంటుంది.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు సూపర్‌స్టార్‌ మహేశ్‌.

I Am Very Confident About The Success Of ‘Sarileru Neekevvaru’.  ‘Bomma Daddarillipoddi’ – Superstar Mahesh

After Blockbuster Hits ‘Bharat Ane Nenu’ and ‘Maharshi’ Superstar Mahesh is coming with an out and out mass entertainer ‘Sarileru Neekevvaru’ Presented by Dil Raju under Sri Venkateswara Creations banner, produced by Ramabrahmam Sunkara in GMB Entertainment and AK Entertainments banners. Young Talented Director Anil Ravipudi is directing this flick. ‘Sarileru Neekevvaru’ is all set to hit the screens worldwide on January 11th. On this occasion, Superstar Mahesh Babu interacted with the media. Here’s the interview…

How is the experience of ‘Sarileru Neekevvaru’?

— It’s an amazing experience. Anil Ravipudi while shooting for ‘F2’, gave me a narration of this story for 40 minutes. I liked it very much. I told him that I have a commitment and will do his film after it’s completion. But, after watching ‘F2’ I wanted to do this film immediately. I got very excited about this storyline. Since ‘Srimanthudu’ i was doing message-oriented films in a separate genre. Fans are expecting ‘Dookudu’ kind of commercial film from me. I was also wanted to do such a film. When I watched ‘F2’, I got related to this film and decided to do it after ‘Maharshi’. We have started shooting for this film in July and finished it in December. Doing this film during this time is one of the best decisions in my life.

How much confident you are about this film?
— ‘Bomma Daddarillipoddi’. I am very confident about the success of ‘Sarileru Neekevvaru’. I am feeling the same vibe since the beginning of the film. The Producers also felt the same after watching the first copy. It only happens when we knew that we are going to score a blockbuster.

You have completed this film very quickly. Will you continue this for your upcoming films too?

— This is the quickest film I did after ‘Businessman’. We decided to start this film in June and release it for Sankranthi the day we locked the story. This is the perfect script for the Sankranthi festival. I took some time to look fit as I am playing as an army major in this film. Then we started filming in July. The entire unit worked without any rest for 125 days. It is due to the constant team effort we were able to ready the film as per plan.

How do you feel making a film blending Patriotism with Entertainment?

— That is the strength of our Director Anil Ravipudi. It’s not a joke to deal with an army major’s story in an entertaining manner along with elevating heroism. At the same time, we can’t treat a responsible character like other ones. Keeping all these things in mind, Ravipudi did a great job of making this film. This is a different film from him compared to his other films.

What factors do you consider while okaying a story?
— I believe in the director while I listen to a story. It’s very important to tune with the director. I will go according to the director once I liked the story. As Anil has very good clarity about this character, It became easy for me doing my character in the film. It is a new kind of experience for me coming out of my comfort zone and did this film after ‘Dookudu’. But, I can’t repeat what I did in ‘Dookudu’. I need to perform freshly within commercial format.

You have gone the extra mile in doing comedy and dance in this film. How do you feel about it?
— Entertainment will be at its peak in Anil Ravipudi’s films. I need to try new timing. Anil also designed my character according to my body language by watching ‘Dookudu’ and ‘Khaleja’ but in a different meter. Coming to the dances, this film has scope for a mass song. We have to give that credit to Sekhar master.

How different this film is when we compare with your other films?
— This film is altogether in a new dimension compared to all of my earlier films. My fans especially will witness a new Mahesh in this film. It has a new timing along with many surprising elements.

What is the reason to select this script particularly?
— I wanted to do a different character that is open and free-spirited. I acted in ‘Srimanthudu’, ‘Bharat Ane Nenu’, ‘Maharshi’ according to the story. I wanted to do a character which is quite in contrast to them and similar to the one I did in ‘Dookudu’. Then this script came to me. I usually give importance to the story. I need to get excited when I listened to the story.  I liked this film very much.

How is it doing scenes in the backdrop of Konda Reddy Buruzu?
— Anil while narrating the script said that this film will have a Kurnool backdrop. Kondareddy Buruzu is a landmark place in Kurnool. It played a role in this film. The scene I did at Kondareddy Buruzu in Okkadu became iconic. Now again erecting Kondareddy Buruzu set for this film made me happy. that entire credit goes to art director Prakash. He recreated Kondareddy Buruzu exactly at Ramoji Filmcity. When I saw the set on the first day I felt nostalgic about ‘Okkadu’ days.

Does this film has a new story or a new treatment?
— This will be very fresh in commercial films. Adience will surely get thrilled and excited while watching it.

How did you prepare for the role of Army Major?
— I haven’t done any special workouts but took care of my diet and reduced 6 kgs of weight. The audience should feel that they are watching an army major. Keeping that in mind, I became fit for the role.

How is it working with  Vijayashanthi after a long time?
— It’s an amazing feeling. I worked with her for ‘Koduku Diddina Kapuram’ film. Then, we occasionally meet during our flights. On the first day of the shoot in our combination, I felt like it’s been a very long time since we both acted together. But, after the first shot, I felt like the shoot of ‘Koduku Diddina Kapuram’ was just completed. No one can do justice to that role like she did. Vijayashanthi garu doing this character became a big advantage for this film and our team. Thanks to her.

Director Anil said That Krishna garu will be seen in this film?
— That is a surprising element in the film. We all are very excited about it.

Which song do you like in the film?
—   The theme song which comes at the start. Devi has penned superb lyrics for that song. Then I like ‘Suryudiva Chandrudivo’ song.

Whose choice is to cast such a huge star cast in the film?
— It’s Anil Ravipudi gari decision. He suggested the actors while he was narrating this story itself. I said okay if they are willing to act. This film has a very good casting.

How do you feel about Chiranjeevi garu appreciating you in the pre-release event?
— Chiranjeevi garu was supporting me for a long time. During ‘Okkadu’, he watched it and loved it. He spoke with me over the phone. Then we erected Madhura Meenakshi Temple set for ‘Arjun’ movie. He came to that set and spend there for a long time. He said that If I do this kind of film, it will do good for the industry. He is my inspiration forever. After watching ‘Pokiri’ He called me from Jagan gari office and asked me to come there. He spoke with me for three hours that day. Since then, for all my Superhits I receive the first call from him only. That’s why I said in the event that I wish to receive the first phone call from him only on January 11th. It was my idea to welcome Chiranjeevi garu to the event as the chief guest. When I asked him to attend the function, He immediately messaged me that he will definitely come to it.”

He also proposed the Dadasaheb Phalke Award for your father Krishna garu…
— That topic came between me and my father when I met him. My father said ‘Chiranjeevi garu spoke very nicely. Thank him on behalf of me.’ Father’s fans became very happy with that.

Did Krishna garu watch the film?
— No, not yet. He will watch it on January 11th.

You helped with the operations of 1000 kids…
—  We collaborated with a couple of other firms and conducted operations. I am very honored to work with Andhra Hospitals and Heal-A-Child foundation. We will extend these services to a much bigger level in the future.

You always give positive signs to your fans…
— It’s a very good trend. Everyone will get good vibes. during the event, while Chiranjeevi garu and Vijayashanthi garu were spoking our entire unit felt very happy seeing them.

How is the work experience with Rashmika Mandanna?
— Her character has very good importance in the film. We neede a fresh face for that role and thus selected her. It was a brilliant choice. Her character in this film is one of the surprising elements. She is very talented.

Songs are getting a very good response. How is the background score?
— Devi is my personal favorite. I feel very happy and relaxed knowing that Devi is doing the background score for my film. Because he is very responsible for his work. He is also very experienced. He knows exactly where the scene starts and where it should end. He gave his best for this movie.

You always repeat your favorite directors. Can we expect another film in Anil Ravipudi’s direction?
— I will definitely do another film. I like Anil Ravipudi very much after doing this film. I haven’t seen such a kind of energy in the directors. Amidst many tensions and problems, He keeps on smiling on the sets. I have never seen anyone like him before. While our team gets tensed, Anil does a small dance to change the mood. I am surprised that he has completed this kind of big project within 5  months.

How is Rathnavelu’s cinematography?
— We started shooting in Kashmir after doing a recce for 15 days. Rathnavelu garu is also one of the main reasons to complete this film very quickly. His work is amazing when it comes to the visuals and quality of the film.

How is it working with producer Anil Sunkara?
— I am happy to make this film with Anil garu under the supervision of Dil Raju garu in GMB. Anil Sunkara is like a family member for me. I know him since ‘Dookudu’. He admires my father a lot. He also shares a special bonding with our family.  He treats me like a family member more than a hero. After watching the first cope he gets excited and messaged me. I felt very happy with that message.

Tell us about the action sequences in this film?
— Ram – Lakshman are my favorite fight masters. They did a splendid job in a couple of action sequences. They designed every fight to have a new touch to it. This is the best in our combination.

What is your next film?
— My next will be directed by Vamshi Paidipally in Dil Raju gari Production. I am very excited about the script narrated by Vamshi. It will be completely in a commercial format….. Superstar Mahesh concludes the interview.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here