‘అలాంటి’ కంటెంట్ వ‌ల్ల‌నే హిట్ అవుతాయ‌నుకుంటే పొర‌పాటే – జె.డి.చ‌క్ర‌వ‌ర్తి

0
88

‘Rx100’ ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్సీ హీరోహీరోయిన్లుగా కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘హిప్పీ’. తెలుగు, తమిళ్‌ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా జె.డి.చ‌క్ర‌వ‌ర్తి `హిప్పీ` సినిమా సంగ‌తుల‌ను తెలియ‌జేశారు…..

◆ నా హెల్త్ సీక్రెట్ గురించి నేను మంచిగా చెబితే మీరు న‌మ్మ‌క‌పోవ‌చ్చు. అలాగ‌ని నా గురించి నేను చెడ్డ‌గా చెప్పుకోలేను. మీ ఆలోచ‌న‌కే వ‌దిలేస్తున్నాను.

◆ నేను తీరిగ్గా లేను త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టిస్తూ బిజీగానే ఉన్నాను. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం లేదు. నాకు న‌ట‌న పరంగా వ‌చ్చే స్క్రిప్ట్స్ బాగా న‌చ్చుతున్నాయి. అందుకే కాద‌న‌లేకుండా న‌టిస్తున్నాను. అయితే ఇంట్రెస్టింగ్‌గా, డిఫ‌రెంట్‌గా అనిపిస్తే ద‌ర్శ‌క‌త్వం త‌ప్ప‌కుండా చేస్తాను. న‌టుడిగా నేను ఎగ్జ‌యిట్ అయిన స్క్రిప్ట్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాను.
◆ బాలీవుడ్‌లో హీరోలు, క‌మెడియ‌న్స్ అనే దాన్ని బేస్ చేసుకుని కాకుండా, క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకునే సినిమాలు చేస్తారు. ఇలాంటి సినిమాల్లో న‌టుల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మ‌న ద‌గ్గ‌ర హీరో బేస్డ్ మూవీలే ఎక్కువ‌. ఇది త‌ప్ప‌ని అన‌డం లేదు. అయితే ఇప్పుడిప్పుడే క్యారెక్ట‌ర్ బేస్డ్ మూవీస్ చేస్తున్నాం. ఇలాగే కంటిన్యూ అయితే క్యారెక్ట‌ర్ బేస్డ్ మూవీస్‌ను మ‌రిన్నింటిని చూడొచ్చు.
◆ మ‌నిషి బావుంటే ఏ బ‌ట్టలేసుకున్నా బావుంటుంది. లేకుంటే మంచి బ‌ట్టలేసుకున్నా బావుండ‌దని నేను న‌మ్ముతాను. అందుక‌నే నేను పూర్తి క‌థ‌ను వింటాను. హిప్పీ క‌థ చెప్పిన‌ప్పుడు మొత్తం క‌థ‌కు, నా క్యారెక్ట‌ర్‌కు బాగా క‌నెక్ట్ అయ్యాను. ప్ర‌స్తుతం యూత్ ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయో అలాంటి క‌థే హిప్పీ. కాబ‌ట్టి క‌నెక్ట్ అయ్యానేమో.
◆ `హిప్పీ`లో ప్లేబోయ్ త‌ర‌హా క్యారెక్ట‌ర్‌. ఓ పెద్ద కంపెనీకి సి.ఇ.ఒగా క‌న‌ప‌డ‌తాను. పెళ్లి అనేది మంచి వాళ్లు మాత్ర‌మే చేసుకోవాలి. కాబ‌ట్టి నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను. క్యారెక్ట‌ర్‌ను బాగా స్ట‌డీ చేశాను.
◆ నేను, కార్తికేయ విరుద్ధ‌మైన పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌తాం. కార్తికేయ‌ని జీవితంలో పైకి ఎద‌గాల‌ని చెబుతుంటాను.
◆ ల‌స్ట్ బేస్డ్ మూవీస్ చాలానే రావ‌చ్చు. అయితే ల‌వ్‌ను స్ట్రాంగ్‌ను క్యారీ చేసే సినిమాలు ఎమోష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతాయి. ఎక్స్‌ట్రార్డినరీ ల‌వ్ కంటెంట్‌లో ల‌స్ట్ కంటెంట్ కొంత ఉండొచ్చు ఏమో కానీ.. ల‌స్ట్ బేస్ చేసుకునే సినిమాలు ఆడ‌వు. ప్రేక్ష‌కులు, మేక‌ర్స్ ఎవ‌రైనా కావ‌చ్చు. కాస్త ల‌స్ట్ సంబంధిత విష‌యాల‌ను ఓపెన్‌గా మాట్లాడుతున్నాం.
◆ `హిప్పీ` స్ట్రాంగ్ ల‌వ్ స్టోరి. కార్తికేయ‌, ఇద్ద‌రి హీరోయిన్స్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరు నాకు బాగా న‌చ్చింది. బోల్డ్ కంటెంట్ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ ల‌వ్‌ ఎమోష‌న‌ల్ కంటెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూడ‌ర‌ని చెప్ప‌లేం. ఎందుకంటే వాళ్లు కూడా చూడాల్సిన సినిమా. మేం కంటెంట్‌ను బోల్డ్‌గా చెప్పి ఉండొచ్చు కానీ.. మంచి కంటెంట్‌ను క్యారీ చేశాం.

◆ కార్తికేయ చాలా మంచి కుర్రాడు. త‌ను కెమెరా ముందు యాక్ట్ చేస్తాడు కానీ.. కెమెరా వెనుక యాక్ట్ చేయ‌డు.
◆ నేను చేసిన‌వి పిచ్చి సినిమాలో, మంచి సినిమాలో కావ‌చ్చు. ఆడినంత మాత్రాన అది గొప్ప సినిమా కాదు.. అడ‌నంత మాత్రాన అది పిచ్చి సినిమా కాదు. నాకు న‌చ్చిన సినిమాలే చేశాను. నా సినిమాల గురించి నేను గ‌ర్వ‌ప‌డుతున్నాను.
◆ కెరీర్ స్టార్టింగ్‌లో నేను కెమెరా ముందుకు వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌సులో చిన్న భ‌యం ఉండేది. అది టెన్ష‌న్ కావ‌చ్చు, ఎగ్జ‌యిట్‌మెంట్ కావ‌చ్చు. అప్పుడే కాదు.. ఇప్ప‌టికీ అలాగే ఉంటుంది. అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ ఉన్న‌ప్పుడే నేను సినిమాలు చేయ‌గ‌లుగుతాను.
◆ అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌లో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాను. స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఇండియ‌న్ సినిమాలో వ‌న్ ఆఫ్ ది గ్రేట్‌యాక్ట‌ర్ ఆ సినిమాలో న‌టిస్తున్నారు. ఆయ‌న ప్రొడ‌క్ష‌న్‌లో కూడా ఇన్‌వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆయ‌నే ఆ సినిమాను అనౌన్స్ చేస్తే బావుంటుంది. ముందు హిందీలో డైరెక్ట్ చేసి త‌ర్వాత తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేసేలా ప్లానింగ్ ఉంది.
◆ ఆర్‌.ఎక్స్ 100 మేకింగ్ చూసి ఎగ్జ‌యిట్ అయ్యాను. దాని రీమేక్ హ‌క్కుల‌ను కొన్నాను. అయితే త‌ర్వాత అది నేను చేయాల్సిన సినిమా కాద‌ని అర్థ‌మై వ‌దిలేశాను. అలాగే అర్జున్ రెడ్డి సినిమా కూడా. ఆ సినిమా ఇవాల్టీ రోజున చాలా సినిమాల‌కు ధైర్యాన్ని ఇచ్చింది. స్ట్రాంగ్ కంటెంట్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here