రివ్యూ: నాని ఎమోషనల్ ‘జెర్సీ’

0
162

చిత్రం: జెర్సీ
నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, సంపత్ రాజ్, ప్రవీణ్, రోనిత్ కమ్రా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫి: సాను జాన్ వర్గీస్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: కొల్ల అవినాశ్
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్
రేటింగ్: 3.5

కథ : క్రికెట్ అంటే పడిచచ్చే అర్జున్ ( నాని ) పెళ్లి చేసుకున్నాక క్రికెట్ కు దూరం కావాల్సి వస్తుంది . సంసార జీవితంలో కొట్టుమిట్టాడుతున్న అర్జున్ కు పదేళ్ల తర్వాత తన కల అయిన క్రికెట్ పై మనసు మళ్లుతుంది . తన లక్ష్యం కోసం మళ్ళీ బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి అడుగుపెడతాడు . అయితే మీద పడిన వయసులో అర్జున్ తన లక్ష్యం అందుకున్నాడా ? ఆ లక్ష్య సాధనలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

విశ్లేషణ: సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మేకర్ గా మరోసారి తన అభిరుచి నిరూపించుకున్నాడు . అనిరుద్ అందించిన పాటలు బాగున్నాయి అంతకంటే నేపథ్య సంగీతం మరింత హైలెట్ గా నిలిచింది . కెమెరామెన్ షాను విజువల్స్ అద్భుతం . నటుడుగా నాని తన సహజ నటనలో   సిక్సర్స్  కొట్టి గెలిస్తే….దర్శకుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఓ మిడిల్ ఏజ్ క్రైసిస్ ని స్పూర్తివంతమైన కథగా సినిమాని తీర్చిదిద్ది ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచారు.

ఈ సినిమాలో డైరక్టర్ తర్వాత మెచ్చుకోవాల్సింది ఆర్ట్ డైరక్టర్ ని.  ఎనభైల నాటి ఇళ్లని, వీధులని, క్రికెట్ స్టేడియమ్ ని  కళ్లకు కట్టారు. అలాగే ఆ జనరేషన్  కాస్ట్యూమ్స్ ని సైతం చాలా నీటుగా ప్రజెంట్ చేసారు. అలాగే అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సీన్స్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ఇక  కెమెరా వర్క్ సైతం మరో ఎస్సెట్. డైలాగులు నీటుగా సీన్స్ , క్యారక్టరైజేషన్స్ కు తగినట్లు ఉన్నాయి..

“నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళాం లేదు” , “ఇంతపెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చెయ్యంది నా కొడుకొక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను” వంటి ట్రైలర్ లో ఇంతకు ముందే వచ్చిన డైలాగ్స్ కు ధియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎడిటింగ్ సెకండాఫ్ ని మరింత క్రిస్ప్ గా చేయచ్చు అనిపించింది. ఓవర్ ఆల్ గా నాని ఖాతాలో మరో హిట్ పడింది. గో అండ్ వాచ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here