లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘జోడీ’

0
286

ఫ్యా మిలీ ఎంటర్ టైనర్స్ కి ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అందుకే ఇసారి అది సాయికుమార్ ‘జోడీ’ లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు. భావనా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు…. పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం ఈ చిత్రాన్ని నిర్మించారు. విశ్వనాథ్ అరిగెల
దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో ఏ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయో చూద్దాం పదండీ.

కథ: కపిల్(ఆది) నెలకు 60 వేలు సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజినీర్. స్నేహితుడు సత్యతో కలిసి సరదాగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతను ఫ్రెంచ్ ట్యూటర్ గా పనిచేసే కాంచన(శ్రద్ధ శ్రీనాథ్)ను తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆమెకు దగ్గర కావడానికి చాలా ప్రయత్నాలు చేసి కాంచన ప్రేమను దక్కిచుకుంటాడు. అయితే తమపెళ్ళికి తన బాబాయ్ (సిజ్జు)అనుమతి తీసుకోవాలని…. అందుకు ఓసారి తన బాబాయ్ ని కలువు అని టైమ్, ప్లేస్ ఫిక్స్ చేసి అక్కడికి రమ్మంటుంది. తీరా అక్కడికి కపిల్ వచ్చేసరికి తన తండ్రిని కొంతమంది రౌడీలు తరుముకుంటా వస్తారు. దాంతో కపిల్ రౌడీలను చితక బాదుతాడు. ఇది చూసిన కాంచన బాబాయ్… వీళ్ళ మ్యారేజ్ కి ఒప్పుకోడు. దాంతో వీరి వివాహానికి బ్రేక్ పడుతుంది. మరి కపిల్ తనపై… తన తండ్రిపై పడిన చెడు ముద్రను ఎలా పోగొట్టుకుని కాంచనాను వివాహం చేసుకున్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు రాసుకున్న కథ… కథనాలు బాగున్నాయి. దానికి తోడు క్రికెట్ బెట్టింగ్ ఆడటం వల్ల పచ్చని కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో అనేది అండర్ గా ఓ మంచి మెసేజ్ ను బెట్టింగ్ రాయుళ్ళకి ఇచ్చాడు దర్శకుడు. అలానే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్లాట్లను అమ్మడానికి కస్టమర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు… ఛీత్కారాలు ఎదుర్కొంటూ వుంటారో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఓవరాల్ గా జోడీ ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. శ్రద్ధ, ఆది ల మధ్య లవ్ సీన్స్ చాలా క్లిన్ అండ్ కూల్ గా తెరకెక్కించారు. అలానే శ్రద్ధ కుటుంబంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగా చూపించారు.
హీరో ఆది… తన గత చిత్రాల కంటే భిన్నంగా… చాలా కూల్ గా కనిపించాడు. శ్రద్ధను ప్రాణంగా ప్రేమించే మంచి లవర్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆది మెకోవర్ కూడా బాగుంది. అలానే శ్రద్ధ కూడా ఫ్రెంచ్ ట్యూటర్ గా… ఆది గర్ల్ ఫ్రెండ్ గా మెప్పించింది. జెర్సీ లో ఎలాగైతే మెప్పించిందో… ఇందులోనూ తన కూల్ నటనతో మెప్పించింది. బెట్టింగ్ రాయునిగా… ఆది తండ్రిగా సీనియర్ నరేష్ బాగా నటించారు. వెన్నెల కిషోర్.. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా బాగా నవ్వించారు. అలాగే సత్య కూడా. శ్రద్ధ తాతయ్యగా గొల్లపూడి మారుతిరావు బాబాయ్ గా సిజ్జు… పిన్ని గా సీతార మెప్పించారు. విలన్ పాత్రలో నటించిన ప్రదీప్ లు మెప్పించారు.
దర్శకుడు రాసుకున్న జోడీకి రాసుకున్న కథ.. కథనాలు ఎమోషనల్ గా… ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ‘నీవే’ ఫణికళ్యాణ్ అందించిన సంగీతం బాగుంది. ఎస్.వి. విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. అది, శ్రద్ధ జంటను అందంగా చూపించారు. ఎడిటింగ్ ఇంకా క్రిస్పీ గా ఉంటే బాగుండేది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా రిచ్ గా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here