టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం- కాదంబరి కిరణ్

0
395

సినిమా లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నాను అని, ఎన్నో బాధలు పడ్డానని, ఎన్నో చేదు అనుభవాలు ఎదురుచూసిన తర్వాత వాటన్నిటి నుంచి వచ్చింది మనం సైతం అని దీని ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చి నేడు కెసిఆర్ అభివృద్ధి పథకాలకు అభినందనలు తెలుపుతూ తెరాస కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు ప్రముఖ నటులు, సామాజిక వేత్త కాదంబరి కిరణ్. ఇందుకు తన స్నేహితులు , సినీ నటులు అందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మనం సైతం ఆధ్వర్యంలో తెరాస కు మద్దతు పలికారు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ లో మూడు వేల మంది కార్మికులనుంచి తెరాస కు మద్దతు పలుకుతూ చేసిన తీర్మానాన్ని జూనియర్ ఆర్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ వల్లభనేని ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బందరు బాబీ కి కాదంబరి కిరణ్ సమక్షం లో అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….
చిన్న సారు కారు సర్కారు పదహారు అనే నినాదంతోటి తెలంగాణ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిందిగా అందరిని కోరుతున్నామని, ఈ ఎన్నికల్లో ఎంపీగా నిలబడిన 16 మందికి మా సపోర్టు ఇచ్చి ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయదలచుకున్నామని చెప్పారు. తెలంగాణ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నా భుజం తట్టి ముందు నన్ను ప్రోత్సహించారని, అందుకే టిఆర్ఎస్ గవర్నమెంట్ కు సపోర్ట్ చేయాలి అనుకున్నానని , టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అనుకున్నానట్టు పేర్కొన్నారు. కేటీఆర్ నాయకత్వంలో పని చేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బందరు బాబీ మాట్లాడుతూ సినీ కార్మికులందరూ తెరాస కు సపోర్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. పేదవారికి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పధకాలు ఎంతో ఆకట్టుకున్నాయని, ప్రాంత బేధాలేకుండా ఇక్కడ అందరూ స్వేచ్ఛగా వున్నారని, తలసాని శ్రీనివాస్ యాదవ్ తమకు అందిస్తున్న ఆధార అభిమానం మర్చిపోలేమన్నారు.
జూనియర్ ఆర్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ వల్లభనేని తెరాస కు మద్దతు తెలుపుతు ఇచ్చిన తీర్మానం తో ముందుకు వచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యగల వ్యక్తిగా కెసిఆర్ నిలవడం అభినందనీయమని, ఇప్పుడు కెసిఆర్ అభిమానులుగా వివిధ పార్టీలనుంచి మరింతమంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కేటీర్ సారధ్యం లో పని చెయ్యడానికి ముందున్నామని, సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ గెలుపుకు శాయశక్తులా కృషి చేస్తామని అనిల్ వల్లభనేని పేర్కొన్నారు. సినీ ప్రముఖులందరూ ముందుకొచ్చి తెరాస కు మద్దతు పలకాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here