షూటింగ్ పూర్తి చేసుకున్న ” కలియుగ”

0
413

బాలాజీ సిల్వర్ స్క్రీన్ పతాకంపై Ch. సుబ్రహ్మణ్యం నిర్మాత గా G. రవీంద్ర బాబు సమర్పణలో A.M. తిరుపతి దర్సకత్వంలో తెరకెక్కిన చిత్రం “కలియుగ” యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం లో స్వాతి దీక్షిత్. విశ్వా. శశి. సూర్య. తాగుబోతు రమేష్. ప్రభాస్ శ్రీను. ధనరాజ్. కారుమంచు రఘు. ప్రధాన పాత్రదారులు. ప్రస్తుత సమాజంలో ప్రేమ. స్నేహం. ముసుగులో జరుగుతున్న అన్యాయాలను కళ్ల కు కట్టినట్టు దర్శకుడు చిత్రీకరించారు. ప్రతి ఒక్కరినీ స్పందింప చేసేలా ఈ చిత్రం ఉంటుంది.అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా కమర్షియల్ హంగులతో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియోను టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ నెలాఖరులో విడుదల చేసి .. ఆగస్టు మొదటి వారం లో చిత్రాన్ని అత్యధిక ధియేటర్స్ లో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య V ప్రభాకర్. ఎడిటింగ్: నందమూరి హరి. మ్యూజిక్: కమల్. ఫైట్స్: నందు. డాన్స్: కృష్ణారెడ్డి .R.K. రమేష్. సమర్పణ: G. రవీంద్ర బాబు. నిర్మాత: Ch. సుబ్రహ్మణ్యం. కధ. స్క్రీన్ ఫ్లై . దర్శకత్వం. A.M. తిరుపతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here