రివ్యూ: థ్రిల్లింగ్ ‘కల్కి’

0
731

‘గరుడవేగ’లాంటి హిట్ తరువాత యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన చిత్రం ‘కల్కి’. ఈ చిత్రానికి ‘అ’లాంటి హిట్ మూవీ అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మీద అటు ప్రేక్షకుల్లోనూ…  ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: కొల్లాపూర్ అనే సంస్థానంలో 1983లో స్థానిక ఎమ్మెల్యే నర్సప్ప(అశుతోష్ రాణా) తమ్ముడు శేఖర్ బాబు(సిద్ధు జొన్నలగడ్డ) దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ హత్యను తన ప్రత్యర్థి పెరుమాళ్లు(శత్రు) చేశాడని నర్సప్ప రగిలిపోతూ వుంటాడు. దాంతో ఊళ్లో అల్లకల్లోలం సృష్టిస్తూ… పెరుమాళ్లును మట్టుబెట్టాలని చూస్తుంటాడు. దాంతో అసలు నిజా నిజాలేంటో తేల్చడానికి ఐపీఎస్ అధికారి కల్కి(రాజశేఖర్) అక్కడికి వస్తాడు. మరి కల్కి.. శేఖర్ బాబు హత్యకేసును ఛేదించాడా? శేఖర్ బాబును ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అసలు కల్కి ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేసిన సినిమా కావడంతో..
కల్కి సినిమాపై ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. దానికి తోడు టీజర్ ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  ఇందులో దర్శకుడు మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్న కథ కథనాలు బాగున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. సంస్థానానికి చెందిన రాజరికంతో మొదలు పెట్టి… నేటి రాజకీయం.. దాని పర్యావసానం తదితర అంశాలతో కథ.. కథనాలను చక్కగా రాసుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.  అ.. లాంటి భిన్నమైన సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ కల్కితో పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. ఓ వైపు పక్కా కమర్షియల్ కథ చెబుతూనే.. మరోవైపు భిన్నమైన స్క్రీన్ ప్లేతో కథను ముందుకు నడిపించి ప్రేక్షకుల్ని కుర్చీలో నుంచి కదలనీయకుండా చేశాడు. మెయిన్ కథకు చాలా ఉప కథలు చెప్పినా… చివర్లో కన్ఫ్యూజన్ లేకుండా కథను క్లారిటీగా చెప్పడం వల్ల ప్రతి ప్రేక్షకుడు హాయిగా ఫీలవుతాడు. ఇది పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్. గో అండ్ వాచ్.

యాంగ్రీ హీరో రాజశేఖర్ ఎప్పటి లాగే తనకు ఇష్టమైన పోలీస్ పాత్రలో అదరగొట్టేశాడు. మర్డర్ మిష్టరీని ఛేదించే ఐపీఎస్ ఆఫీసర్ గా స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు. యుఖ్యంగా యాక్షన్ సీన్స్ బాగా చేశారు. అలానే విలన్ గా నటించిన అశుతోష్ రాణ కూడా రౌద్రం పండించారు. ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్దూ జొన్నలగడ్డ తన కూడా తన పాత్రకు న్యాయం చేశారు. హీరోయిన్లు గా నటించిన ఆదా శర్మ, నందిత శ్వేత తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక చెప్పుకోవాల్సింది ఇందులో ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ గురించి. జర్నలిస్టు పాత్రలో బాగా నటించించారు. ఓ వైపు తన హావ భావాలతో నవ్విస్తూనే.. మొదటి నుంచి చివరి దాకా ఎంతో ఇంపార్టెంట్ రోల్ పోషించారు. నాజర్, శత్రు, జబర్దస్థ్ మహేష్ తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ… అ లాంటి వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం తరువాత ఒక కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ను డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించడానికి ముందుకు రావడం ప్లస్ అయింది. ల ేకుంటే.. కొంత మంది ఆడియన్స్ కే పరిమితమ్యే సినిమాలను తీస్తాడనే ముద్ర పడిపోయేది. ఈ చిత్రానికి ప్రధాన ఆయుపట్టు స్క్రీన్ ప్లే. చివరి అరగంట దాని ఇంపార్టెన్స్ ఏంటో తెరమీద చూస్తేనే అర్థం అవుతుంది. అలానే మరో ప్రధాన ఆకర్షణ.. సినిమాటోగ్రఫీ. ప్రతి లొకేషన్ ని ఎంతో రిచ్ గా చూపించారు. మల్లెల తీర్థం లాంటి లొకేషన్స్ కూడా ఇందులో కొత్తగా వున్నాయి. వాటిని తెరమీద మరింత బాగా చూపించారు. అలానే హీరో రాజశేఖర్ ను చాలా స్టైలిష్ గా.. అందంగా చూపించారు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా వుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టేశారు.

చివరగా.. యాక్షన్ తో థ్రిల్ చేసే ‘కల్కి’

రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here