జూన్ 28న రాజశేఖర్ ‘కల్కి’ విడుదల..!

0
16

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన ‘హార్న్ ఓకే’ పాటను బుధవారం రెడ్ ఎఫ్.ఎమ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు. లలిత కావ్య పాడిన ఈ పాటను కేకే రాశారు. ‘మధుర’ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ “పక్కా కమర్షియల్ చిత్రమిది. కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన కమర్షియల్ ట్రైలర్, టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అదే విధంగా ఆకట్టుకుంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలను అందించాడు. నేపథ్య సంగీతం కూడా బాగా చేస్తున్నాడు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “డిఫరెంట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమా ‘కల్కి’. ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది. కమర్షియల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేసి తమకు ట్రైలర్ ఎంత నచ్చిందో చెప్పారు. సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ టాప్ ట్రెండ్స్ లో నిలిచింది. రాజశేఖర్ గారి ఇమేజ్‌కి త‌గ్గ విధంగా, కొత్త తర‌హా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను ప్రశాంత్ వర్మ తీశారు. ఆయన కథ, దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి” అని అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో… థియేటర్లలో ప్రేక్షకులకు ‘కల్కి’ అంత ఉత్కంఠ కలిగిస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. నిర్మాత సి. కళ్యాణ్ గారు ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు” అని అన్నారు.

అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ – సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

*”Kalki” set for a massive release on June 28th worldwide*

Angry Star, Dr. Rajasekhar is back with his new movie Kalki. Prashanth Varma, the talented director, who impressed with ‘Awe’ is directing the movie Kalki. Presented by Shivani & Shivatmika, Kalki is being produced on Happy Movies banner by C Kalyan. The film has completed its shoot and the makers are all set to release the film on the 28th of this month.

On this occasion, producer C Kalyan said “Kalki is an out and out commercial potboiler. The commercial trailer which was released has received a tremendous response and the same will happen with the film once it releases. Very soon, we will release the songs and also announce the pre-release event’s date. Music Director Shravan Bhardwaj has given good tunes and is composing a terrific background score. The post-production is on in full swing and Kalki will release on June 28th”.

Jeevitha Rajasekhar said ” Kalki is a different mass entertainer which suits the image of Rajasekhar perfectly. The film has created a superb buzz in social media and the trailer is already trending on YouTube. Director Prashanth Varma has showcased the film and Rajasekhar in a new style which all the fans and audience will love. Prashanth Varma’s stylish narration will be the highlight of the film”.

Last but not least, director Prashanth Varma said “Kalki is a superb thriller. The audience will love the film and enjoy it like an India-Pakistan cricket match. The thrills are an edge of the seat and C Kalyan has given me free hand on the budget which will show on the screen in a grand manner. The song “Horn Ok Please” sung by Lalitha Kavya will be out on Wednesday.”

Star Cast

Dr. Rajasekhar, Adah Shrma, Nadhitha Shwetha, Poojita Ponnada, Scarlet Wilson, Rahul Ramakrishna, Nasser, Ashutosh Rana, Shiddu Jonnalagadda, Charan Deep. Venu Gopal, Bennela Ramarao, D S Rao, Satish(Banti) play key roles.

Technical Crew

Cameraman – Dasaradhi Sivendra
Music- Shravn Bhardwaj
Art – Nagendra
Editor- Gautam Berusu
Stills – Murthy
Lyrics – Krishnakanth
Costume Designer – Aditi Agarwal
Fights- Naga Venkat, Robin-Subbu
Production Controlelr – Bala Gopal Rao
Chief-Co-Director – Madhava Sai
Line Producer – Venkat Kumar Jetty
PRO-Naidu Surendra Kumar, Phani Kandukuri
Producer-C Kalyan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here