కార్తికేయ మార్కెట్ ను దెబ్బతీసిన ‘హిప్పి’

0
27

అంతకు ముందు ఓ చిన్న చితకా మూవీలో నటించినా… Rx100తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా తరువాత వచ్చిన క్రేజ్ ను చూసే తమిళంలో ఫెమస్ అయిన ప్రొడ్యూసర్ కలైపులి తాను ‘హిప్పి’లాంటి సినిమాను తీయడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాతో పాటు Rx100 డైరెక్టర్ అజయ్ భూపతి అసిస్టెంట్ తో ‘గుణ369’ కూడా చేశాడు. అయితే హిప్పి ఇటీవల విడుదలై దారుణ పరాజయం పాలైంది. దాంతో ఆ ప్రభావం ఇప్పుడు ‘గుణ369’ పై పడింది. హిప్పి విడుదలకు ముందు ఈ చిత్రం హిందీ హక్కులు రూ.3 కోట్లకు ఆడిగినట్టు సమాచారం. అయితే హిప్పి డిజాస్టర్ కావడం… గుణ369 టీజర్ నాసిరకంగా ఉండటంతో.. ఇప్పుడు ఒక కోటికి కూడా అడగటం లేదని ఫిల్మ్ నగర్ సమాచారం. కేవలం చొక్కా ఇప్పేసి కెమెరా ముందు నిలబడితే సరిపోదు… కంటెంట్ ఉన్న కథలని… విషయం ఉన్న దర్శకులను నమ్ముకోవాలని కార్తికేయకు ఈపాటికి బాధపడి ఉండాలి. వచ్చిన కథలన్నింటినీ చేసుకుంటూ పోతే హిప్పిలాంటి పిప్పి కథలే వస్తాయి. మార్కెట్ దారుణంగా దెబ్బతింటుంది. భవిష్యత్తు లో నైనా కార్తికేయ మంచి కథలను ఎన్నుకుంటే మంచిది.. లేకుంటే… ఇతర హీరోల్లాగా కార్తికేయ కథ కూడా కంచికే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here