లీసా 3డి` అన్నిచోట్లా సేఫ్ క‌లెక్ష‌న్స్ `లీసా 3డి` విజ‌యం సంతోషాన్నిచ్చింది: సురేష్ కొండేటి

0
20

అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `లీసా 3డి`. రాజు విశ్వ‌నాథం ద‌ర్శ‌కుడు. వీరేష్ కాసాని స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్.కె.పిక్చ‌ర్స్ ప‌తాకంపై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఏపీ- తెలంగాణ‌లో దాదాపు 300 పైగా 3డి థియేట‌ర్ల‌లో సినిమా రిలీజైన సంగ‌తి తెలిసిందే. రిలీజైన‌ ప్ర‌తి చోట ఈ సినిమా చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో నిలిచింద‌ని..మొదటి మూడు రోజుల్లో ఇప్పటికీ కొన్ని పంపిణీ వ‌ర్గాలు ఆనందం వ్య‌క్తం చేయ‌డం సంతోషాన్నిచ్చింద‌ని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ-“ఈ శుక్ర‌వారం సినిమా రిలీజైంది.. తొలి వీకెండ్ మూడురోజులు చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించింది. రిలీజైన కొన్ని చోట్ల వ‌సూళ్ల ప‌రంగా పంప‌ణీవ‌ర్గాలు సంతోషం వ్య‌క్తం చేశాయి. ఈ వారం అంతా ఇదే హుషారు క‌నిపిస్తుంద‌ని భావిస్తున్నాం. ముఖ్యంగా లీసా 3డిలో హార‌ర్ తో పాటు సెంటిమెంట్ హైలైట్ గా నిలిచింది. రెండున్న‌ర గంట‌లు . 2గం.ల పాటు ఆద్యంతం ఉత్కంఠ క‌లిగించే స‌న్నివేశాలు మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాయి. అంజ‌లి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు“ అని తెలిపారు. ఈ ఉత్సాహంల‌నే త‌దుప‌రి స్ట్రెయిట్ తెలుగు సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నాం. ఇత‌ర‌త్రా వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here