3D ఫార్మాట్ లో అలరించే ‘కురుక్షేత్రం’

0
252

మహాభారతంలోని ఘట్టాలను బేస్ చేసుకొని ఇప్పటికే తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు, సీరియళ్లు చాలానే వచ్చాయి. అవన్నీ ప్రేక్షకాదరణ పొంది…. కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు మరోసారి మహాభారతంలో ప్రధాన ఘట్టమైన ‘కురుక్షేత్రం’ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని భారీ సాంకేతిక హంగులతో తొలిసారిగా 3D ఫార్మాట్ లో నిర్మించి విడుదల చేశారు. ఇందులో కన్నడ హీరో దర్శన్, అర్జున్, అంబరీష్, సోనూసూద్, నిఖిల్ కుమార స్వామి, స్నేహ, అదితి ఆర్య, రవిశంకర్, హరిప్రియ, రవిచంద్ర తదితరులు నటించారు. మరి ఈ కురుక్షేత్రం ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: మహాభారతంలో దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి.. అలాగే మహాభారత ఇతివృత్తం గురించి అందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా ధర్మరాజును రాజుగా ప్రతిపాదిస్తుండగా దుర్యోధ‌నుడు (ద‌ర్శ‌న్) .. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. ఆ తరువాత జరిగిన సంఘటనల అనంతరం క‌ర్ణుడు(అర్జున్)ని దుర్యోధ‌నుడు (ద‌ర్శ‌న్) రాజుగా ప్రకటించి ఆప్తమిత్రుడిగా చేసుకుంటాడు. అయితే అప్పటికే శకుని తన వంశానికి జరిగిన అన్యాయానికి బదులుగా తన కపట నాటకాలతో కుట్రలతో కౌరవులకు పాండవులకు మధ్య యుద్దాన్ని సృష్టిస్తాడు. అసలు శకుని అలా చేయడానికి గల కారణాలు ఏమిటి ? క‌ర్ణుడు మరియు దుర్యోధ‌నుడు మధ్య స్నేహం ఎంత గొప్పది ? చివరికీ కౌరవుల మీద పాండవులు ఎలా గెలిచారు ? ఆ గెలుపుకు శ్రీ కృష్ణుడు ఎలా కారణమయ్యాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ: మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ద నేపథ్యంలో పూర్తి 3D ఫార్మాట్ లో తెరకెక్కించడమే ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్. పైగా అన్ని ముఖ్య పాత్రలకు అగ్ర కన్నడ నటీనటులు నటించడం.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌ర్ణుడుగా ద‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా నిఖిల్‌ గౌడ్‌, కృష్ణుడిగా ర‌విచంద్ర‌న్ ద్రౌప‌దిగా స్నేహ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో చాల బాగా నటించారు.

కర్ణుడు పాత్రలో నటించిన అర్జున్, ఆ పాత్రకు తగ్గట్లు హావభావాలతో.. అభిమ‌న్యుడిని చావుకు కారణమయ్యే సన్నివేశం.. అలాగే కుంతీదేవి పుత్ర భిక్ష పెట్టమని అడిగే సన్నివేశం లాంటి కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నటించి అర్జున్ సినిమాకి హైలెట్ గా నిలచారు. అదేవిధంగా దుర్యోధ‌నుడిగా నటించిన ద‌ర్శ‌న్ కూడా అద్భుతంగా నటించాడు. మయసభలో ద‌ర్శ‌న్ మీద వచ్చే సాంగ్ కూడా చాల బాగుంది. అభిమన్యుడు పాత్రలో నిఖిల్ గౌడ్ అదరగొట్టాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.
దర్శకుడు నాగన్న 3డిలో భారీ విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఆకట్టుకున్నాడు.. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఉన్నతంగా ఉన్న విజువల్స్ ను ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ పర్వాలేదు. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీ సాంకేతిక హంగులతో నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
గో అండ్ వాచ్ ఇట్..!
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here