‘ఎవ్వరికీ చెప్పొద్దు’ మూవీ టీంని అభినందించిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్

0
84

క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్‌ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబర్‌ 8న విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్ల మంచి స్పందన లభించింది. ఫిల్మ్ క్రిటిక్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ఇష్టపడి తమ స్పందన తెలియజేశారు. వీరితో పాటు పలు హిట్ చిత్రాల్ని అందించిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమా టీం ని అభినందించారు.

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ…
పెళ్ళిచూపులు తర్వాత నాకు అంత మంచి ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నాకు ఇందులో ఏదో స్పార్క్ ఉందనిపించింది. ఈ సినిమాలో ఫైర్ ఉంది. బుక్ మై షో లో… అలాగే
ప్రేక్షకుల రివ్యూ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఆహ్లాదకరంగా ఉంది. ప్రొడ్యూసర్ గా, హీరోగా రాకేష్ సక్సెస్ అయ్యాడు. టెక్నీషియన్స్ ఈ సినిమాకు బలం. శంకర్ మంచి డైరెక్టర్. బాగా చదువుకున్నాడు. చాలా మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా రైటింగ్ చాలా బాగుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సూపర్బ్.
రాకేష్ పట్టుదల వల్లే హీరో. ప్రొడ్యూసర్ అయ్యాడు. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని సినిమా చేసాడు. స్క్రీన్ మీద చాలా బాగున్నారు. డైలాగ్స్ చాలా బాగా చెప్పాడు. హీరోయిన్ ని నార్త్ అమ్మాయి అనుకున్న. తెలుగు అమ్మాయి చాలా బాగా చేసింది. కొన్ని సీన్స్ లో హీరోను డొమినెట్ చేసింది. చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. 50 రోజుల సినిమాగా నిలుస్తుంది. అని అన్నారు.

హీరో, నిర్మాత రాకేష్‌ వర్రె మాట్లాడుతూ…. మా సినిమా రిలీజ్‌కు సపోర్ట్‌ చేస్తున్న అందరికి చాలా థాంక్స్. లగడపాటి గారు మా టీం ని పిలిచి మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా కష్టపడి చేసాం. ఎవరన్నా సపోర్ట్ చేస్తారని చూస్తున్నాం. అలాంటి టైం లో సినిమా పెద్దలు చాలా మంది ఆశీర్వదించారు. 10 ఇయర్స్ కష్టం మాది. మూవీ హౌస్ ఫుల్ అవుతోంది. స్లో గా స్టార్ట్ అయినా.. ఇప్పుడు హౌస్ ఫుల్ అవుతున్నాయి. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అని అన్నారు.

చిత్ర దర్శకుడు బసవ శంకర్‌ మాట్లాడుతూ…. లగడపాటి గారికి స్పెషల్ థాంక్స్ . మమ్మల్ని పిలిచి అభినందించారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని ప్రోత్సహిస్తున్న అందరికీ చాలా థాంక్స్.

హీరోయిన్ గార్గేయి మాట్లాడుతూ… లగడపాటి గారి మాటలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. చూడని వారు తప్పకుండా చూడండి. హారతి అనే క్యారెక్టర్‌ని నాకు ఇచ్చిన డైరెక్టర్‌ బసవ శంకర్‌గారికి థ్యాంక్స్‌. అలాగే నిర్మాతగారికి థ్యాంక్స్‌. ఇంత మంచి ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చిన నా టీమ్‌కు థ్యాంక్స్‌
అని అన్నారు.

న‌టీన‌టులు:
రాకేశ్ వ‌ర్రె
గార్గేయి ఎల్లాప్ర‌గ‌డ‌

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: బ‌స‌వ శంక‌ర్‌
నిర్మాత‌:  రాకేశ్ వ‌ర్రె
రిలీజ్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్‌
కెమెరా:  విజ‌య్ జె.ఆనంద్‌
సంగీతం:  శంక‌ర్ శ‌ర్మ‌
ఎడిట‌ర్స్‌: బ‌స‌వ శంక‌ర్‌, తేజ యర్రంశెట్టి, స‌త్య‌జిత్ సుగ్గు
సౌండ్ డిజైన్‌:  సింక్ సినిమా
పాట‌లు:  వాసు వ‌ల‌బోజు
కాస్ట్యూమ్స్‌: అమృత బొమ్మి
ఆర్ట్‌: ల‌క్ష్మి సింధూజా గ్రంధి
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  కేత‌న్ కుమార్
క‌ల‌రిస్ట్‌:  వివేకానంద్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనంత్‌( ప‌ద్మ శ్రీ యాడ్స్‌)
ప్రొడ‌క్ష‌న్ హౌస్‌:  క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here