విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా “లిసా” త్రిడి ట్రైలర్ లాంచ్

0
97

“లిసా” ట్రైలర్ లాంచ్ విక్టరీ వెంకటేష్ ఈ రోజు (గురువారం) సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “అంజలి మంచి ఆర్టిస్టు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ ట్రైలర్ ఆకట్టుకునేలాఉంది సురేష్ కొండేటి కి లిసా యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్” అన్నారు .

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ… ‘దెయ్యాల కథలతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. హారర్ జోనర్ లో దెయ్యం కాన్సెప్ట్ బిగ్ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తోంది లీసా. దెయ్యాల్ని లైవ్ 3డిలో చూడబోయే త్రీడీ చిత్రం ఇది. సెన్సార్ పూర్తి అయింది. ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. సెన్సార్ సభ్యులు కూడా సినిమాను చూసి అభినందించారు. ఇది రెగ్యులర్ దెయ్యం కాదు.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే 3డి దెయ్యం. థియేటర్లలో ధడధడ లాడిస్తుంది. ప్రేక్షకుడికి గజగజను పరిచయం చేసే అరుదైన దెయ్యం ఇది. ది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. సౌండ్ ఎఫెక్ట్స్ .. అందుకు తోడు 3డి విజువల్స్ ఆద్యంతం థియేటర్లలో ఆడియెన్ ని గగుర్పాటుకు గురి చేయడం ఖాయం’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here