యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘లవర్స్ డే’

0
167

రేటింగ్: 3
ఒక్క కన్నుగీటుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాధించుకుంది మలయాళ హీరోయిన్ ప్రియా వారియర్. ఒమర్ లులు దర్శకత్వంలో నటించిన ఆమె… తన కొత్త సినిమా టీజ్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమెకు జంటగా రోషన్ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రావడం కూడా బాగా ప్లస్ అయింది. మరి అంత హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం యూత్ ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: రోషన్ (రోషన్), ప్రియా (ప్రియా ప్రకాష్ వారియర్) ఇద్దరూ క్లాస్ మేట్స్. తొలి చూపులోనే ఇద్దరూ ప్రమలో పడతారు. అయితే.. ప్రియా మాత్రం తన ప్రేమను చెప్పదు. దాంతో రోషన్ తన క్లాస్ లోనే చదువుతున్నగాధ (నూరిన్ షెరిఫ్‌) సహాయంతో ప్రేమిస్తున్నట్టు చెప్పిస్తాడు. ఆ తరువాత అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో వీరి లవ్ బ్రేకప్ అవుతుంది. అయితే వారిద్దనీ మళ్ళీ కలపడానికి గాధ ఏమి చేసింది? ఈ క్రమంలో గాధకు రోషన్ పై ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి? అదే విధంగా గాధ పై రోషన్ కి ఏ ఫీలింగ్ కలిగింది? ప్రియా – రోషన్ ఇద్దరూ మళ్లీ కలుస్తారా? అలాగే గాధ – రోషన్ బంధం ఫైనల్ గా ఎలా ముగిసింది? తదితర విషయాల తెలియాలంటే సినమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఈ సినిమా టీజర్ లో ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. దాంతో సినిమా టీజర్‌‌ కూడా బాగా వైరల్ అయి.. సినిమా పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. అందుకు తగ్గట్టుగానే ప్రియా వారియర్ ఈ సినిమాలో నటించి మెప్పించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్ తో యూత్ ని బాగా ఆకర్షించింది. రోషన్, ప్రియా వారియర్ల మధ్య వచ్చే సన్నివేషాల్లో కెమిస్ట్రీ బాగా కుదిరింది. క్లాసులో చిలిపిదనం… స్నేహితుల మధ్య వచ్చే చిన్న గిల్లి కజ్జాలు లాంటి సీన్లన్నీ మెప్పిస్తాయి. అదే విధంగా మరో హీరోయిన్ గా నటించిన నూరిన్ షెరిఫ్‌ తన గ్లామర్ తో పాటు… తన నటనతోనూ మెప్పిస్తోంది. ముఖ్యంగా హీరోకు ఆమెకు మధ్య వచ్చే సీన్లన్నీ బాగున్నీయి. ముఖ్యంగా ఎమోషనల్ సాగే క్లైమాక్స్ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా బాగా నటించింది. ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులతో పాటు, కాలేజీలో పని చేసే స్టాఫ్, వాళ్ళలో మెయిన్ గా ఫ్యూన్ మరియు డ్రిల్ మాస్టర్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ద్రౌపది నాటకం లాంటి కొన్ని సీన్స్ లో బాగా నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు ఒమర్ కొత్తవారితో యూత్‌ ఫుల్ కంటెంట్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. యూత్ కి కనెక్ట్ అయ్యే డైలాగులతోనూ… మంచి స్క్రీన్ ప్లేతో నడిపించిన తీరు బాగుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్ గా వుంది. దర్శకుడు తన విజన్ కి తగ్గట్లుగా కథ.. కథనాలను రాసుకున్నాడు. ఇంతకు ముందు తెలుగులో వచ్చిన హ్యాపీడేస్ తరహా కథ.. కథనాలు నడిపించి యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్కూల్ డేస్ గుర్తొచ్చేలా ప్రతి సన్నివేషాన్ని ఆడియన్స్ మెచ్చే విధంగా తెరపై చూపించారు. షాన్ రెహమాన్ పాటలు బాగున్నాయి. సినిమాకు తగ్గట్టుగా నేపథ్య సంగీతాన్ని అందించారు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. సో.. ఈ వీకెండ్ లో యూత్ కి మంచి ఛాయిస్ ఈ సినిమా. గో అండ్ వాచ్ ఇట్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here