సేవకు మరోపేరు ‘మనం సైతం’

0
410

పేదల గుండె ధైర్యంగా నిలుస్తున్న మనం సైతం మరో ఆపన్నుడిని ఆదుకుంది. డ్రైవర్స్ యూనియన్ లో పనిచేస్తున్న పి రాజు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్స కోసం 3 లక్షల రూపాయలు అవసరం అవుతాయని వైద్యులు చెప్పారు. రాజు దీన పరిస్తితి తెలుసుకున్న కాదంబరి కిరణ్ వెంటనే స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ద్వారా 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కాదంబరి కిరణ్ ఆర్థిక సహాయం చేయడంతో ఆగిపోకుండా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దృష్టికి రాజు పరిస్థితిని తీసుకెళ్లారు. స్పందించిన తలసాని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 55 వేల రూపాయల సహాయం ఇప్పించారు. గురువారం ఈ చెక్ ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సికింద్రాబాద్ మారేడుపల్లిలోని తన కార్యాలయంలో కాదంబరి చేతుల మీదుగా రాజుకు అందజేశారు. అనంతరం రాజు మనం సైతం లాంటి గొప్ప సంస్థను నిర్వహిస్తున్న కాదంబరి కిరణ్ కు, మంత్రి తలసానికి కృతజ్ఞతలు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here