పుట్టినరోజు సందర్భంగా మంతెన వెంకట రామరాజు భారీ వితరణ!

0
255

‘వసుధ ఫౌండేషన్’ పేరిట దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు విరాళమిస్తూ… సేవాసంపన్నుడిగానూ వినుతి కెక్కిన ప్రముఖ పారిశ్రామికవేత్త మంతెన వెంకట రామరాజు…

తన పుట్టిన రోజు (జులై 29)ను పురస్కరించుకుని వివిధ సంస్థలకు12 లక్షలు వితరణ చేశారు. తన ఇంటి దగ్గర అత్యంత నిరాడంబరంగా కొవిడ్ నిబంధనలకు లోబడి జరిగిన ఈ కార్యక్రమంలో.. శ్రీమతి మంతెన వరలక్ష్మి వెంకట రామరాజు, ప్రగతి రిసార్ట్స్ అధినేత జి. బి.కె.రావు, సహ పారిశ్రామికవేత్తలు రంగరాజు, సదాశివరెడ్డి, ‘మనం సైతం’ కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్నవారిలో.. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ (2 లక్షలు), కరుణశ్రీ సేవా సమితి (1లక్ష), వైదేహి సేవాసమితి (2 లక్షలు), ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ (1 లక్ష), హైద్రాబాద్ చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీ (2 లక్షలు), పల్లవి ఆశ్రమం (1 లక్ష),
హైద్రాబాద్ జిల్లా మహిళా మండలుల సమాఖ్య (1 లక్ష),
అనురాగ్ హ్యూమన్ సర్వీసెస్ (2 లక్షలు), గాంధీ భవన్ న్యాస్
(1లక్ష), మనం సైతం (50 వేలు) తదితర సంస్థలున్నాయి.
మానవ సేవే మాధవ సేవగా తానెప్పుడూ భావిస్తానని, వసుధ ఫౌండేషన్ ద్వారా సహాయం అందుకునే సంస్థలన్నీ చిత్తశుద్ధితో సేవాలందించేవేనని మంతెన వెంకట రామరాజు పేర్కొన్నారు.
అనంతరం ఆయన… ‘మనం సైతం’ సారధ్యంలో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటి… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త-తెరాస యువ ఎం.పి. జోగినపల్లి సంతోష్ కుమార్ ను అభినందించారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here