“మ‌న్యం” స‌క్సెస్‌మీట్‌

0
388

సాయి సంహిత్ బ్యాన‌ర్ పై ఎస్‌.వి.ర‌మ‌ణ ద‌ర్శ‌క నిర్మాణంతో రూపొందిన చిత్రం మ‌న్యం. ప్ర‌భాక‌ర్‌,

వ‌ర్షా బొల్ల‌మ్మ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ నెల‌ 3వ తారీకున విడుద‌లై అన్ని సెంట‌ర్స్‌లో విజ‌యం సాధించిన సంద‌ర్భంగా పాత్రికేయ స‌మావేశంలో ర‌మ‌ణ మాట్లాడుతూ … నేను 10 ఏళ్ళ నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నాను. 4, 5 ఏళ్ళ నుంచి ప్రేక్ష‌కుల్లో కూర్చుని నా చిత్రాన్ని ఇలా తెర మీద ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూసేవాడ్ని. ఈ చిత్రం మొద‌లు పెట్టి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. చాలా క‌ష్ట‌ప‌డ్డాను .చిన్న సినిమా బ‌డ్జెట్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రంలో క‌థే హీరో అన్న కాన్సెప్ట్‌తో నేను స‌బ్జెక్ట్‌ను రాసుకున్నాను. దాదాపు 34 సెంట‌ర్ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేశాను. డిస్ర్టిబ్యూట‌ర్లు నాకు చాలా స‌హాయం చేశారు. హీరోయిన్ వ‌ర్షా చాలా బాగా చేశారు. ఆమెకు తెలుగు రాదు నా వ‌ల్లే నేర్చుకున్నారు అని అన్నారు. ఇక్క‌డ‌కు విచ్చేసినందుకు రాజ్ కందుకూరి గారి కి కృత‌జ్ఞ‌త‌లు. పిల‌వ‌గానే వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. మీ పెళ్ళిచూపులు చిత్రం చూశాను చాలా బావుంది. మీరు న‌న్ను ఒక మాట అడిగారు సినిమా విడుద‌లైంది డ‌బ్బులు వ‌చ్చాయా అని? డ‌బ్బులు కాదు ముఖ్యం మీరు ఇక్క‌డ‌కు రావ‌డం చాలా సంతోషం అని అన్నారు. ఈ చిత్రంలో నా టెక్నీషియ‌న్లు అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు నా టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
రాజ్ కందుకూరి.మాట్లాడుతూ… ముందుగా నేను ఇక్క‌డ‌కి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం చిన్న సినిమాల‌ని గౌర‌వించాల‌ని నా అభిప్రాయం. బాహుబ‌లి చిత్రం ఎంత క‌ష్ట‌ప‌డి చేశారు. చిన్న సినిమాలు కూడా అంతే క‌ష్ట‌ప‌డి చేస్తార‌ని గుర్తించాలి. ఎందుకంటే ఏ డైరెక్ట‌ర్ ప‌డే క‌ష్ట‌మైనే అంతే ఉంటుంది. పైగా ఇది ఫారెస్ట్ని కాపాడుకునే నేప‌థ్యంలో ఉన్న చిత్రం. ఇందులో న‌టించిన న‌టీన‌టులంద‌రికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. చిన్న సినిమాల ప్ర‌మోష‌న్ కోసం నేను త‌ప్ప‌కుండా వ‌స్తాను అన్నారు. షార్ట్ ఫిల్మ్ మేక‌ర్స్ కోసం నా త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని అన్నారు.
హీరోయిన్ వ‌ర్షా మాట్లాడుతూ… ముందుగా డైరెక్ట‌ర్ గురించి నేను చాలా చెప్పాలి సినిమా క్రెడెట్ మొత్తం డైరెక్ట‌ర్‌దే సార్ వ‌ల్ల నేను చాలా నేర్చుకున్నాను. న‌న్ను నేను స్క్రీన్ మీద చూసుకున్న‌ప్పుడు నేనేనా ఇలా చేసింది అని ఆశ్చ‌ర్యం క‌లిగింది. నేను చేసే ప్ర‌తీ సీన్ నాకు డైరెక్ట‌ర్‌గారు స్వ‌యంగా చేసి చూపించారు. నా త‌ర్వాత చిత్రంలో మ‌ళ్ళీనేను ఇలాంటి క్యారెక్ట‌ర్‌ని చెయ్య‌గ‌ల‌నో లేదో అని అన్నారు. డైరెక్ట‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.
హీరో ర‌ఘువీర్ మాట్లాడుతూ… ఈ చిత్రం మొద‌లు పెట్టిన‌ప్పుడు నేను చెయ్య‌గ‌ల‌నో లేదో అనుకుని భ‌య‌ప‌డ్డాను కానీ డైరెక్ట‌ర్ స‌హాయ స‌హ‌కారాల‌తో చాలా బాగా చెయ్య‌గ‌లిగాను. ఒక న‌లుగురి ఫ్రెండ్స్‌ని ముందుకి న‌డిపే బాధ్య‌త నీ మీద ఉంట‌ది అని అన్నారు. ఈ చిత్రం కోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు. నేను, వ‌ర్షా ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాం అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ… డైరెక్ట‌ర్ అసోసియేష‌న్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు నా పేరు స‌దాచంద్ర ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాను చ‌క్క‌టి
నేప‌థ్యంతో ఈ చిత్రంలో చేశాను అన్నారు.చ‌క్క‌టి ఆర్ ఆర్ కుదిరించి అన్న‌య్యర‌మ‌ణ‌ నేను ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డి చేశాము. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here