‘మిస్ ఇండియా’ ఊర్వశీ రౌతేల హీరోయిన్ గా ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్లాక్ రోజ్’

0
38

పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం:4గా ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ” మేము నిర్మిస్తున్న ‘బ్లాక్ రోజ్’ చిత్ర యూనిట్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆగస్ట్ 17 నుండీ నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నాము. రెండు సార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఊర్వశీ రౌతేల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా ‘బ్లాక్ రోజ్’ కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. కోవిడ్ టైమ్ లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది. చిత్రాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాము.” అన్నారు

ఈ చిత్రాన్ని క్రియేట్ చేస్తున్న సంపత్ నంది మాట్లాడుతూ – ” షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ‘విచక్షణలేని, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్ ను జోడిస్తూ ‘బ్లాక్ రోజ్’ ను నిర్మిస్తున్నాం.” అన్నారు

ఊర్వశీ రౌతేల హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్,
ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ,
ఎడిటర్: తమ్మిరాజు,
పిఆర్ఓ: బి.ఎ.రాజు,
డిఓపి: సౌందర్ రాజన్,
సంగీతం: మణిశర్మ,
సమర్పణ: పవన్ కుమార్,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
క్రియేటెడ్ బై: సంపత్ నంది,
దర్శకత్వం: మోహన్ భరద్వాజ్.

*Miss India Urvashi Rautela Starrer Emotional Thriller ‘Black Rose’ Created By Sampath Nandi In Srinivasaa Silver Screen Production*

Producer Srinivasaa Chhitturi who has produced several Superhit films is coming with Emotional Thriller ‘Black Rose’ as Production No:9 in Srinivasaa Silver Screen banner Presented by Pavan Kumar. This film is being made as a bilingual in Telugu and Hindi languages. ‘Black Rose’ is created by Superhit films director Sampath Nandi while Mohan Bharadwaj is Directing it.

Srinivasaa Chhitturi said, ” Our latest film ‘Black Rose’ starts roling from August 17 in a non-stop manner. We have conducted COVID19 tests for the entire unit members. Gorgeous Urvashi Rautela who won Miss India Pageant for two times and did many Hindi films as Heroine is doing the lead role in this film. Though she got many offers in Telugu earlier she wanted to get introduced in Telugu with an apt subject. After listening to ‘Black Rose’ she gets impressed immediately agreed to do this film. She is taking all the necessary precautions in these COVID times while shooting for the film. We are working round the clock to complete the film in a single schedule.”

Creator of the film, Sampath Nandi said, ” ‘Black Rose’ is a female oriented Emotional Thriller based on a character named Shylock from Shakespeare’s ‘Merchant Of Venice’. ‘Black Rose’ also deals with the point from Kautilya’s ‘Arthashastra’.”

Written By : Sampath Nandi, Mohan Bharadwaj
Art Director : Acharya Satyanarayana
Editor : Thammiraju
PRO : B.A. Raju
DOP : Sondar Rajan
Music : Mani Sharma
Presented By : Pavan Kumar
Producer : Srinivasaa Chhitturi
Created By : Sampath Nandi
Direction : Mohan Bharadwaj

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here