ఇంట్రెస్టింగ్ ‘మిస్ మ్యాచ్’

0
219

ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌ పై ఎన్ వి. నిర్మల్ ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన చిత్రం `మిస్ మ్యాచ్‌`. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో చూద్దాం పదండి…
కథ : సిద్ధూ (ఉద‌య్ శంక‌ర్‌) చిన్నప్పటి నుండే జీనియస్.. తన అద్భుతమైన మెమోరీ పవర్ తో గిన్నీస్ బుక్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంటాడు. అలాగే కనకమహాలక్ష్మి (ఐశ్వ‌ర్యా రాజేష్) చిన్న తనంలోనే చదువు మానేసి కుస్తీనే జీవితంగా మార్చుకుంటుంది. ఒలింపిక్ లో గోల్డ్ మోడల్ కొట్టాలనే లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తోంది. ఇలా తమ వృత్తులతో పాటు ఇష్టాలలో మరియు ఆలోచనలలో చివరికీ వారి జీవన శైలిలో కూడా పూర్తి విరుద్ధమైన లక్షణాలు ఉన్న ఈ ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? ఆ ప్రేమ కోసం ఇద్దరూ ఏమి చేశారు? ఇంతకీ కనకమహాలక్ష్మి ఒలింపిక్ లో గోల్డ్ మోడల్ సాధించడానికి ఎన్ని సమస్యలను ఎదుర్కొంది? కనకమహాలక్ష్మి ఆ సమస్యల నుండి బయటపడి గెలవటానికి సిద్దు ఎలాంటి సహాయ సహకారాలు అందించాడు? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ ను కళకళలాడించాయి. మిస్ మ్యాచ్ కూడా అలా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు. ఏ అంశంలోనూ మ్యాచ్ కానీ ఒక అమ్మాయి అబ్బాయి ఇష్ట పడి ఒక్కర్ని ఒక్కరూ కావాలనుకోవడం.. కానీ వారి జంట వారి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అందరికీ పూర్తి ‘మిస్ మ్యాచ్‌’గా అనించడం.. ఇక ఆ ప్రేమికులిద్దరూ అందర్నీ ఎలా ఒప్పించారు ఈ క్రమంలో వాళ్ళు అనుకున్నది సాధించి ఎలా ఒక్కటయ్యారు అనే కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచి మెసేజ్ అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ ఉంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ శంకర్ తన పాత్రకు తగ్గట్లు చాల బాగా నటించాడు. ముఖ్యంగా హీరోయిన్ తో ప్రేమలో పడే సీన్ లో మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.

అలాగే కుస్తీ వీరురాలి పాత్ర‌లో నటించిన ఐశ్వ‌ర్యా రాజేష్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించింది. మెయిన్ గా ఆమె పాత్ర ద్వారా స్పోర్ట్స్ కి సంబంధించి ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ బాగుంది. ఇక ఐశ్వ‌ర్యా రాజేష్ బలహీనమైన ఎమోషనల్ సీన్స్ లో కూడా తన నటనతో ఆ సీన్స్ ను పండించింది. హీరో హీరోయిన్ల కలయికలో వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేసే సన్నివేశం. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
దర్శకుడు నిర్మల్ కుమార్ మంచి స్టోరీ లైన్ ను తీసుకుని.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకొని విజయం సాధించారు. సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ చాలా వున్నాయి.

సెకెండ్ హాఫ్ లో సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఒక ఊరు మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతుందనే అంశాన్ని తీసుకొచ్చి కథలో సీరియస్ నెస్ ని పెంచి… దాంతో పాటు అదే ట్రాక్ ను లవ్ స్టోరీకి కనెక్ట్ చేసి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. గిఫ్టన్ ఇలియాస్ అందించిన సంగీతం బాగుంది. గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3.5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here