కేంద్రాన్ని ఎండగట్టిన ఎంపీ గల్లా జయదేవ్!

0
51

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం : అవిశ్వాసంపై చర్చను ప్రారంభించడం సంతోషంగా ఉంది – మద్దతిచ్చిన పార్టీలన్నింటికీ ధన్యవాదాలు – భరత్ అనే నేను సినిమాను ప్రస్తావించిన గల్లా జయదేవ్ – ఒక వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నదే కథాంశం – కానీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను విస్మరించారు – ఇది టీడీపీ, బీజేపీ మధ్య యుద్ధం కాదు – ఇది ఏపీ ప్రజల ధర్మపోరాటం – ఏపీ విషయంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు – ఏపీ ప్రజలను వంచనకు గురిచేస్తున్నారు – అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు – లోక్ సభ తలుపులు మూసి ఏపీని విభజించారు – ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి ఇచ్చారు – ఏపీపై రూ.లక్షా 3వేల కోట్ల రుణభారం మోపారు – వినియోగాన్ని బట్టి విద్యుత్ పంపకాలు చేశారు – అప్పులు మాత్రం జనాభా ప్రకారం పంచారు – సింగరేణి కాలరీస్ లో 51 శాతం వాటాను తెలంగాణకు ఇచ్చారు – విభజన జరిగిన నాలుగేళ్ల తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేకుండా ఉంది – మోదీ ప్రభుత్వ చర్యలతో ఏపీ మరింత వివక్షకు గురవుతోంది – ఇవ్వాల్సింది ఇవ్వలేదు.. హామీలు నెరవేర్చలేదు – ఏపీ పునర్విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా ఆమోదించారు – ఇదే సభలో విభజన బిల్లు ఎలా ఆమోదించారో ప్రతిఒక్కరికి తెలుసు – రూ. 16 వేల కోట్ల కనీస రెవెన్యూ లోటును కూడా పూడ్చుకోలేని పరిస్థితి – రూ.24 వేల కోట్లు లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది – విభజనతో ఏపీ భారీగా నష్టపోయింది – విభజనతో ఏపీ ఆదాయ వనరులను కోల్పోయింది – విభజన పాపంలో బీజేపీది కూడా సగం ఉంది – ఏపీ పునర్విభజన బిల్లు పాస్ కావడంలో కాంగ్రెస్‌తో సమానమైన బాధ్యత బీజేపీకి ఉంది – పొరుగువారితో పోల్చుకోవడం సమాజంలో సహజ సూత్రం,అదేవిధంగా మా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నాం – అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఉండేది – విభజన తర్వాత ఏపీ అట్టడుగు పడిపోయింది – తక్కువ జనాభా, అధిక వనరులతో తెలంగాణ ముందు, ఏపీ వెనకబడింది – వ్యవసాయ రంగంలో కాస్త ముందున్నా.. పారిశ్రామికంగా పొరుగురాష్ట్రాలతో వెనకబడి ఉంది – పారిశ్రామిక, సేవల రంగంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే పూర్తిగా వెనుకబడి ఉంది – విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటి కూడా జాతీయ సంస్థ లేదు – కేంద్రం జాతీయ సంస్థలను ప్రకటించినప్పటికీ అవి ఎదగడానికి సమయం పడుతుంది – తలసరి ఆదాయంలోనూ ఏపీ వెనుకబడి ఉంది – దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో 20 శాతం వెనకబడి ఉన్నాం – ప్రత్యేక హోదాను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా – ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు చాలా ప్రత్యేకమైనది – వాస్తవాలను వక్రీకరించకుండా సుస్పష్టంగా విన్నవిస్తుననా – తెలుగుతల్లిని కాంగ్రెస్ రెండుగా విభజించిందని మోదీగారే అన్నారు – కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను బతికించిందని మోదీ అన్నారు – తెలుగుతల్లిని కాంగ్రెస్ రెండుగా విభజించిందని మోదీగారే అన్నారు – తల్లీబిడ్డ ఇద్దరినీ సంరక్షించే బాధ్యత తమదని మోదీ అన్నారు, మేము విశ్వసించాం – ప్రధానిమంత్రిగారు..మీకన్నా ముందున్న ప్రధానమంత్రి ఇచ్చిన హామీలపై మీకు గౌరవం ఉందా? – మీరిచ్చిన హామీలు చేస్తారని మేము విశ్వసించవచ్చా? – ఆనాడు రాజ్యసభలో ఎంపీగా అన్న నాయకులు ఐదేళ్లు కాదు పదేళ్లు అని చెప్పిన విషయం మీకు గుర్తుందా? – తిరుపతి, నెల్లూరులో మీరిచ్చిన భరోసా గుర్తుందా? – నేను తినను.. ఎవర్నీ తిననివ్వనని అన్నారు.. వెతికివెతికి పట్టుకుంటానన్నారు – ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసానికి, వెన్నుపోటుకు గురయ్యారని భావిస్తున్నారు – ఈ మాటలన్నీ ఆవేదన, ఆందోళనతో వస్తున్నవే – మోసానికి, నమ్మకద్రోహానికి గురయ్యామని ఆంధ్రా ప్రజలు ఆవేదన చెందుతున్నారు – రాష్ట్ర విభజన ప్రత్యేక హోదా ఇస్తామనే హామీతోనే ప్రారంభమైంది – కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే పార్లమెంటు చేసిన అతి పెద్ద తప్పు – ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం మిథ్య – ఆర్థిక సంఘం సభ్యుడు టి.గోవిందరావుగారు అలాంటి సిఫార్సు చేయలేదని చెప్పారు – ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డిగారు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు – 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్రం ప్రత్యేక హోదాను తిరస్కరించింది – ఏ కమిషన్ ఇచ్చిన సిఫార్సులనైనా పాత తేదీతో అమలు చేయడమన్నది పార్లమెంటు చరిత్రలో లేదు – గతంలో ఇచ్చిన హామీలకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు వర్తించవు – సమయం విషయంలో ఇక్కడ కూడా మమ్మల్ని వివక్షకు గురిచేయవద్దు – మా ఆవేదనను అర్థం చేసుకోండి – ప్రధాన మంత్రగారు, ఆర్థిక మంత్రిగారు వాస్తవ విషయాలను గమనించండి – మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి – ఇంత జరిగినా.. ఆర్థికమంత్రిగారు కరుణించలేదు, చిల్లిగవ్వ విదల్చలేదు – మార్చి 17న బీజేపీ అధ్యక్షుడు ఇది బీజేపీ, టీడీపీకి మధ్య యుద్ధమని చెప్పారు – ఇప్పుడు జరుగుతున్నది బీజేపీకి, టీడీపీకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు – ఆధిపత్యానికి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమిది – ఇది ధర్మపోరాటం.. ధర్మయుద్ధం – ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమన్నది మోదీ ప్రభుత్వం వివక్ష – భారతదేశంలో భాగమైన ఏపీకి కనీస ప్రాధాన్యత ఇవ్వట్లేదు – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రాజకీయ క్రీడలో భాగం చేశారు – రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు – బీజేపీ, వైసీపీ, జనసేన మేము యూటర్న్ తీసుకున్నామని ఆరోపిస్తున్నాయి – మీరు చెప్పండి.. మేము ఎక్కడ యూటర్న్ తీసుకున్నామో – జీఎస్టీ అమలు తర్వాత ప్రత్యేక హోదా అనేదే ఉండదని చెప్పారు- దేశంలో వెనకబడిన జిల్లాలకు ఇచ్చినట్లే మా రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు ఇచ్చారు – కేబీకే, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ మాకెందుకు ఇవ్వలేదు – కేబీకేకు రూ.5200 కోట్లు, బుందేల్‌ఖండ్‌కు రూ.7,200 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు – ఆ రెండు ప్యాకేజీల కింద తలసరిగా 4115 ఖర్చు చేస్తే, ఏపీకి 428 ఇచ్చారు ఇదేం న్యాయం – యూసీలు ఇవ్వలేదని అనేక సందర్భాల్లో ఆరోపించారు – ప్రతి యూసీని ఇక్కడ చూపించేందుకు సిద్ధంగా ఉన్నా – వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్నారు, ఇది నిజం కాదా? – వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల దస్త్రం ఇంకా పీఎంవోలోనే పడి ఉంది, ఇదా మీరు మాకు చేసే న్యాయం? – పనుల విభజనలో భాగంగా ఏపీకి రూ.3200 కోట్ల నష్టం జరిగింది, దీన్ని ఎవరు భర్తీ చేస్తారు? – 42 శాతం నిధులు రాష్ట్రాలకు ఇస్తామంటున్నారు – 2.35 లక్షల కోట్ల సెస్సుల్లో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా రావట్లేదు – 11 ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలతో పోలిస్తే రెవెన్యూ లోటు ఎక్కవ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – బీజేపీ మమ్మల్ని ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా చూస్తోంది తప్ప..దక్షిణాది రాష్ట్రాలతో కాదు – ఇదేనా మాకు దక్కుతున్న గౌరవం? – ఎఫ్ఆర్‌బీఎం నిబంధనలని చెప్పేదంతా కాలయాపన కోసమే – కేంద్రం ఇచ్చే నిధులను దేశంలో ఏ రాష్ట్రమైనా ఎస్‌పీవీ ఏర్పాటు చేసిందా? – కేంద్రం ఇచ్చే నిధులకు దేశంలో ఏ రాష్ట్రమైనా ఎస్‌పీవీ ఏర్పాటు చేసిందా? – పోలవరానికి రూ.58,600 కోట్లయితే.. రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు – కొత్త రాజధానికి రూ.43 వేల కోట్లు అవసరమైతే వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు – పోలవరానికి ఇచ్చే నిధులు విభజన చట్టంలోని సెక్షన్ 90 కింద ఇచ్చేవి – ఏపీకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విభజన చట్టంలో భాగంగా ఇచ్చినవే – ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే నిధులన్నీ పునర్విభజన చట్టం ప్రకారం కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే – ఎంతో ఉదారంగా సాయం చేశామని చెప్పడం శుద్ధ అబద్ధం – ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3 వేల కోట్లు, పటేల్ విగ్రహానికి రూ.3,500 కోట్లు ఇచ్చారు – మా రాజధానికి ఇచ్చింది కేవలం రూ.వెయ్యి కోట్లు – మా రాజధాని విగ్రహాల విలువ చేయదా? – ఢిల్లీ కన్నా పెద్దది, ఉత్తమమైన రాజధాని నిర్మిస్తామని ప్రధాని స్వయంగా హామీ ఇచ్చారు – ఇతర రాజధానులు చూసి రావాలని కూడా ప్రధాని చెప్పారు – కజకిస్థాన్ రాజధాని ఆస్థానాకు వెళ్లి చూసి రావాలని ప్రధానమంత్రిగారు మీరు చెప్పలేదా? – మీరిచ్చిన హామీతో రైతులంతా ముందుకొచ్చి భూములిచ్చారు – రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను మీరు సందిగ్ధంలో పడేశారు : ఎంపీ గల్లా జయదేవ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here