రివ్యూ: రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్  ‘Mr మజ్ను’

0
49

రేటింగ్: 3
అఖిల్ అక్కినేని హీరోగా ‘తొలిప్రేమ’తో విజ‌యాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫ్యామిలీ ల‌వ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘Mr మజ్ను’. మంచి ప్రేమ‌క‌థ‌తో ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈ చిత్రంతో అఖిల్ అక్కినేని ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించాడో చూద్దాం పదండి.

క‌థ‌: విక్ర‌మ్ కృష్ణ అలియాస్ విక్కీ అలియాస్ కృష్ణ‌ (అఖిల్‌) యుఎస్‌లో ఎం.ఎస్‌.చ‌దువుతుంటాడు. అత‌న్ని చూడ‌గానే ప్ర‌తి అమ్మాయి ఇష్ట‌ప‌డుతుంది. వాళ్లు అత‌ని జీవితంలోకి వ‌చ్చినా, వెళ్లినా అత‌నికి పెద్ద ప‌ట్టింపు ఉండ‌దు. త‌న‌కు రాముడిలాంటి భ‌ర్త రావాల‌నుకుంటుంది నిక్కి (నిధి). ఆమెకు విక్కీ తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఇద్దరూ ఒకేసారి ఇండియాకు వ‌స్తారు. కాబోయే చుట్టాల‌ని వాళ్ల‌కి ఎయిర్‌పోర్టులోనే తెలుస్తుంది. నిక్కి అన్న (రాజా)కు, విక్కీ చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటారు. అలా విక్కీ, నిక్కీ బంధువుల‌వుతారు. నిక్కీకి ఆడ‌ప‌డుచు లాంఛ‌నాలు పెట్ట‌డానికి విక్కీ తండ్రి కొంచెం డ‌బ్బులిచ్చి విక్కీని ద‌గ్గ‌రుండి చూసుకోమంటాడు. అలా విక్కీ, నిక్కీ మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అత‌నంటే ఆమెకు ఇష్టం క‌లుగుతుంది. రెండు నెల‌ల్లో అది ప్రేమ‌గా మారుతుందేమోన‌ని టెస్ట్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిందా? ఆ ప్రేమ పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లిందా? వెళ్లక‌పోతే వారి ప్రేమ‌కు వ‌చ్చిన అవాంత‌రాలేంటి? వాటికి విక్కీ కార‌ణ‌మా? నిక్కీ కార‌ణ‌మా వంటి అంశాలు సినిమాలో చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌: ఈ కాలంలో అంద‌రూ త‌మ‌కు న‌చ్చిన‌ట్టే ఉండాల‌ని అనుకుంటున్నారు. జీవితంలోకి వ‌చ్చే అవ‌త‌లివారు చెప్పే మార్పుల‌ను ఏదో కాసేపు వినాల‌నుకుంటున్నారు. ఆ కాసేపు త‌ర్వాత కూడా అది కొన‌సాగితే స‌ఫ‌కేష‌న్‌గా ఫీల‌వుతున్నారు. ఆ స‌ఫ‌కేష‌న్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని అనుకున్న త‌రుణంలోనే గొడ‌వ‌లు, దూరాలు పెరుగుతున్నాయి. `మిస్ట‌ర్ మ‌జ్ను` కూడా ఒక ర‌కంగా ఇలాంటి సినిమానే. `మిస్ట‌ర్ మ‌జ్ను` లో నాయిక త‌న‌కు రాముడి లాంటి భ‌ర్త కావాల‌నుకుంటుంది. అయితే విక్కీ చెప్పే కొన్ని డైలాగులు విన్న త‌ర్వాత ఆమె మ‌న‌సు మారుతుంది. అత‌నిలోనూ మంచి ల‌క్ష‌ణాల‌ను చూడ‌టం మొద‌లుపెడుతుంది. అత‌ని మీద అతి ప్రేమ‌ను చూపిస్తుంది. అప్ప‌టివ‌ర‌కు అలాంటి ప్రేమ‌ను ఆస్వాదించ‌ని విక్కీకి అది అతిగా అనిపిస్తుంది. ఆ ఉక్కిరిబిక్కిరి ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌కు రావాల‌నుకుంటాడు. అయితే ఆ విష‌యాన్ని అమ్మాయితో కాకుండా, త‌న ఫ్రెండ్‌తో చెబుతాడు. చాటుగా వింటుంది నిక్కి. ఆత్మాభిమానం ఉన్న ఆమె విక్కీ నుంచి దూరం జ‌రుగుతుంది. ఆమె దూర‌మైన త‌ర్వాత గానీ అత‌నికి ఆమె త‌న‌పై చూపించిన నిజ‌మైన ప్రేమ అర్థం కాదు. అక్క‌డి నుంచి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక ఆమెను ఇంప్రెస్ చేయ‌డ‌మే హీరో ప‌ని. ఇక్క‌డివ‌ర‌కు క‌థ బాగానే సాగినా, ఆ త‌ర్వాతే రొటీన్‌గా అనిపిస్తుంది.

 అన్న‌దమ్ములంద‌రూ జాయింట్ గా ఉన్న‌ట్టు చూపించిన ఈ సినిమాలో అన్న కుమార్తె వివాహానికి సుబ్బ‌రాజు వెళ్ల‌డా?. పైగా వాట్సాప్‌లో గానీ, పెళ్లి వీడియోగానీ చూడ‌రా? అనే అనుమానం కూడా క‌లుగుతుంది. ఒక‌వేళ అలా గ‌నుక సుబ్బ‌రాజు వాటిని చూసి ఉంటే అత‌నికి విక్కీ ఎవ‌రో కృష్ణ ఎవ‌రో తెలిసిపోయేది. అక్క‌డి నుంచి సెకండాఫ్‌కి స్కోప్ కూడా ఉండేది కాదు. క‌థ ముందుకు సాగాల‌ని సుబ్బ‌రాజు పెళ్లికి వెళ్ల‌న‌ట్టు చూపించారేమో.. సెకండాఫ్‌లో దిల్‌రాజు మ‌న‌వ‌డు ఆర్ష‌న్ రెడ్డి సీన్లు బావున్నాయి. కొంత‌లో కొంత రిలీఫ్‌గా అనిపించాయి. `మిస్ట‌ర్ మ‌జ్ను`ని చూస్తున్నంత సేపు `తొలిప్రేమ‌`లో స‌న్నివేశాలే గుర్తుకొస్తాయి. అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య వ‌చ్చిన కాన్‌ఫ్లిక్ట్ ని చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ రెండు చిత్రాల్లోనూ క‌నిపిస్తుంది. అఖిల్ అటు డ్యాన్సుల్లోనూ, ఇటు ఫైట్ల‌లోనూ, కొన్ని డైలాగులు చెప్ప‌డంలోనూ ఎక్స‌లెంట్ అనిపించాడు. సితార ప్రీ క్లైమాక్స్ లో చెప్పే డైలాగులు ఆలోచింప‌జేస్తాయి. రిలేష‌న్‌షిప్‌లో ఉండేవారికి, అందులో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వారికి కాస్త క‌నెక్ట్ అయ్యే సినిమా. లాజిక్కులు మ‌ర్చిపోయే చూస్తే బాగానే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల‌ను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా, ఇంకాస్త కొత్త‌గా రాసుకుని ఉండాల్సింది.

ప్ల‌స్ పాయింట్స్
– అఖిల్  న‌ట‌న‌
– అంద‌మైన ఫ్యామిలీ ఎమోష‌న్స్
– డైలాగులు
–  పాట‌లు

 మైన‌స్ పాయింట్స్
– పాత క‌థ‌
– క‌న్విన్సింగ్‌గా లేని సెకండాఫ్‌

నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌

తారాగ‌ణం: అఖిల్ అక్కినేని, నిధిఅగ‌ర్వాల్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, రావు ర‌మేష్‌, నాగబాబు, విద్యుల్లేఖారామ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ అది, అజ‌య్‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌

కూర్పు: న‌వీన్ నూలి

ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌

నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here