జగన్… మీరిచ్చే హామీలు.. అమలు సాధ్యం కాదు- ముద్రగడ పద్మనాభం

0
205

జగన్ ప్రకటన ఎంతో బాధించింది, తుని సభ తర్వాత పలు సార్లు కాపు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు..ఇప్పుడు కేంద్రం పరధిలో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఎప్పటికి మా కులాలు అణగారిన వర్గాలుగా ఉండిపోవాలని జగన్ భావిస్తున్నారు..మేం బిసి రిజర్వేషన్ లో వాటా అడగడం లేదు.. గతంలో తాము అనుభవించిన రిజర్వేషన్ మా హక్కు.కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించిన నేలపైనే జగన్ ఈ ప్రకటన చేయడం మా జాతిని అవమానించినట్టే..గత ఆరు నెలలుగా మీరు చేస్తున్న పాదయాత్రలో ఎన్నోహామీలు ఇస్తున్నారు..అవన్ని అమలు సాధ్యమేనా.. రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ చివరకు అమెరికా బడ్జెట్ కూడా జగన్ ఇచ్చిన హామీలకు సొమ్ములు సరిపోవు. అధికారం కోసం మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారే, మా జాతి రిజర్వేషన్ల కోసం మేం పోరాటం చేయడం తప్పా.. కాపులకు టికెట్లు ఇవ్వకండి.. మా ఓట్లు అడగకండీ, కాపులు మీకు ఎందుకు పనికిరారు.. ఒక్కో నియోజకవర్గంలో కాపు సోదరుల మధ్య టిక్కెట్ పోటీ పెట్టి పాదయాత్రకు లక్షలు ఖర్చు చేయిస్తున్నారు.. ఒకటి రెండు ఫ్లెక్సీలు చాలవా.. కాపునేతలు మీ కోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు తెచ్చి పాదయాత్రకు ఖర్చు చేస్తున్నారు.. పదవీ ఆరాటం కోసం మీరు వేల కోట్లు ఇస్తామంటున్నారు.. మా పై సవతితల్లి ప్రేమ చూపించకండి.. మేం తిరగబడం, తిరిగబడితే కేసులు పెట్టి బౌన్సర్లతో దాడి చేయిస్తారు.. మేం మీకు స్వాగతం పలికేందుకు రాలేదన్న అక్కసుతో కోటికి పైగా ఉన్న మా జాతికి అన్యాయం చేయవద్దు. నా కుటుంబంపై దాడి చేసినప్పుడు లేని ప్రేమ ఇప్పుడెందుకు చూపిస్తున్నారు.. కపట ప్రేమ చూపించకండీ. నా కాపు జాతి ప్రయోజనాలు తప్ప మరే ఇతర ప్రలోభాలు మాకు అవసరం లేదు.. మాజాతి రిజర్వేషన్, ప్రయోజనాలను గౌరవించిన వారి పల్లకీ మోస్తాం.. వారికే మా మద్దత్తు.. మా మనోభావాలతో ఆడుకోవద్దు, మీరు పదవీ కాంక్షను వదిలేయండీ.. మేం రిజర్వేషన్లు వదులుకుంటాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here