పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న నమస్తే సేట్ జీ సినిమా

0
35

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న నమస్తే సేట్ జీ సినిమా

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ లో తల్లాడ శ్రీనివాస్ నిర్మాత తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తూ హీరోగా చేస్తున్న సినిమా ” నమస్తే సేట్ జీ”. సాయి కృష్ణ ,స్వప్న ,శోభన్ బాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “ముఖ్యంగా కిరాణా షాపు వారి జీవన శైలి రూపంలో ఈ తెరకెక్కుతుంది మంచి కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది, కోవిడ్ సమయంలో కిరాణా షాపు వ్యక్తులు చేసిన సేవ, అలాగే కనపడని శ్రామికులుగా ఒక కిరాణా షాపు వ్యక్తి పాత్ర ని సినిమా లో చూపించాము, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి, త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదల చేస్తాము” అని తెలిపారు.

సంగీత నేపథ్యం – రామ్ తవ్వ
ఎడిటింగ్ – వివేకానంద విక్రాంత్
కెమెరా – శివ రాథోడ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here