“నిన్ను తలచి” ఫస్ట్ లుక్ లాంచ్

0
35

ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిన్ను తలచి. అనిల్ తోట దర్శకత్వంలో నేదురుమల్లి, అజిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వంశీ, స్టెఫీ పాటెల్ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్ లో ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. విలేకరుల సమావేశంలో…

నిర్మాత అజిత్ మాట్లాడుతూ… కొత్త బ్యానర్ తో పాటు కొత్త హీరో హీరోయిన్లతో కలిసి చేస్తున్న సినిమా. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అని అన్నారు.
హీరోయిన్ స్టెఫీ పటేల్ మాట్లాడుతూ… టాలీవుడ్ లో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆడాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు అనిల్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి సినిమా చేసాం. ఈ సినిమాకు అవకాశం కల్పించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. అలాగే ఈ చిత్రం కూడా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరి లో సినిమా ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.
పూర్ణచారి మాట్లాడుతూ… టైటిల్ పెట్టిన దగ్గరి నుంచి మంచి సినిమా చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యింది. ఇంత మంచి సినిమాలో పార్ట్ అయినందుకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి కృతజ్ఞతలు. హీరో, హీరోయిన్ చాలా బాగా చేసారూ. సంగీతం బాగా కుదిరింది. ఈ సినిమాలో అన్ని క్రాఫ్ట్లు బాగా వచ్చాయి. మా టీమ్ అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.
హీరో వంశీ మాట్లాడుతూ… నాకి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాను మీరందరు తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికి ఆల్ ది బెస్ట్. అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here