‘నన్నుదోచుకుందువ‌టే’ టీజ‌ర్ రిలీజ్

0
96

‘స‌మ్మెహ‌నం’తో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేసిన హీరో సుధీర్ బాబు… తాజాగా సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్  ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా  ‘నన్ను దోచుకుందువ‌టే’ తో పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం మెద‌టి లుక్ పోస్ట‌ర్ నుండి ప్రేక్ష‌కుల్లో  అంచ‌నాలు పెరిగాయి.  నభా నటేశ్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ రోజే  టీజ‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి… త్వ‌ర‌లో విడ‌దల  చేస్తారు.

ఈసందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ… సుధీర్ బాబు గారు హీరోగా  సుదీర్‌బాబు ప్రోడ‌క్ష‌న్స్ లో ‘నన్నుదోచుకుందువ‌టే’ సినిమాతో నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చిత్రానికి సంబందించిన టీజ‌ర్ ని ఈ రోజు రిలీజ్ చేసాం.  ఈ చిత్రం ప్రోడ‌క్ష‌న్ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దు అనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు చేస్తున్నారు. క‌థ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మిగ‌తా వివ‌రాలు ఎనౌన్స్ చేస్తాం. అని అన్నారు.

నటీనటులు
సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు

సాంకేతిక వర్గం
డిఓపి – సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ – అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
పిఆర్ఓ – ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్. సాయి వరుణ్
నిర్మాత – సుధీర్ బాబు
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ – ఆర్ ఎస్. నాయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here