రివ్యూ: NGK… ఆకట్టుకునే ఓ పొలిటికల్ డ్రామా..!

0
35

నటీ నటులు :  సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, దేవరాజ్ తదితరులు
నిర్మాత : ఎస్ ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు ఎస్ ఆర్
సంగీతం : యువన్ శంకర్ రాజా
దర్శకత్వం: శ్రీ రాఘవన్

రేటింగ్: 3.25

సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కాంబినేషన్లో టాలెంట్ డైరెక్టర్ శ్రీ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “ఎన్ జి కె”. ఈ మూవీ భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. సూర్య స్టార్డమ్ తో పాటు, సెల్వ రాఘవన్ గత చిత్రాలు బృందావన కాలనీ, యుగానికొక్కడు తెలుగులో మంచి విజయాలు సాధించడంతో ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు ఎంత వరకు అందుకుందో  తెలుసుకుందాం పదండి

కథ: నందగోపాల్ (సూర్య) ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని, ఉద్యోగం వదిలేసి, సొంత ఊరికి వచ్చి వ్యవసాయం మొదలుపెడతాడు. స్వతహాగా సోషల్ అక్టీవిస్ట్ అయిన గోపాలం తన చుట్టూ ఉన్న ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఉంటాడు. ఐతే కొన్ని సంఘటనలు ప్రజలకు మంచి చేయాలన్నా, వ్యవస్థలను శాసించాలన్నా రాజకీయ నాయకుల వల్లే అవుతుందని గ్రహించి, ప్రతిపక్ష పార్టీ లోకల్ ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తగా జాయిన్ అవుతాడు. మరి గోపాల్ పాలిటిక్స్ లో ఉన్నత స్థితికి చేరుకున్నాడా?ఈ నేపథ్యంలోనే రకుల్ పాత్ర ఏమన్నా ఇంపార్టెన్స్ ను చూపిందా? నందగోపాల్ తను అనుకున్న లక్ష్యాలను ఎలా ఛేదించాడు అన్నదే అసలు కథ.

కథనం విశ్లేషణ: పొలిటికల్  డ్రామాగా NGK ను మలచడంలో  దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఓ సామాన్యుడు ముఖ్యమంత్రి గా  ఎదగడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో అనేదాన్ని చాలా రియల్ స్టిక్ గా చూపించారు. సొంత పార్టీ కార్యకర్తలనే పొలిటీషియన్స్ ఎంత నీచంగా చూస్తారనేదాన్ని బాగా చూపించారు. అలానే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు పొలిటికల్ స్టాటజిస్ట్ లను, సోసియల్ మీడియా PR లను నియమించుకొని రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని రకుల్ పాత్రను తీర్చిదిద్దారు. ఆమెది రాహుల్ గాంధీ సోసియల్ మీడియా హెడ్ రమ్య పాత్రను పోలివుంది. అచ్చం రమ్య ఆహార్యం లానే రకుల్ చూపించింది. అలానే సూర్య నటన కూడా హైలైట్. ఎమ్మెల్యే కి దగ్గరవడానికి నందగోపాల్ నటించే తీరు, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలలో సూర్య నటన ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో సిద్ శ్రీరామ్ పాడిన రకుల్ సూర్యాల మధ్య వచ్చే మెలోడీ సాంగ్ బాగుంది.ఇక సాయి పల్లవి సూర్య భార్యగా గీత పాత్రలో మెప్పించింది. ఫోటో గ్రఫీ, ఎడిటింగ్ బాగు న్నాయి.టెక్నికల్ గా రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here