రివ్యూ: నోటా

0
139

తారాగణం: విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సత్యరాజ్, నాజర్, ప్రియదర్శి తదిత‌రులు
సంగీతం : సి యస్ సామ్
నిర్మాతలు : జ్ఞానవేల్‌ రాజా
దర్శకత్వం : ఆనంద్ శంకర్
రేటింగ్: 3
వరుస హిట్లతో దూసుకుపోతున్న యూత్ ఐకానిక్ గా మారిన విజయ్ దేవరకొండ… తాజాగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ త్రిల్లర్ చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందించారు. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి విజయ్ దేవరకొండ తన గత చిత్రాల్లాగే మెప్పించాడో లేదో చూద్దాం పదండి.

కథ : వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవన్ సుబ్రహ్మణ్యం(నాజర్) పెద్ద కుమారుడు. వాసుదేవన్ తన పై వచ్చిన ఆరోపణలు.. నమోదైన కేసులో భాగంగా.. తన సీఎం పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల గురించి కనీస అవగాహన లేని వరుణ్ ని సీఎం ని చేస్తాడు. వరుణ్ తన తండ్రి ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రిగా మేనేజ్ చేస్తుంటాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య, వరుణ్ కొన్ని సమస్యలను ఎదురుక్కోవాల్సి వస్తోంది. దాంతో వరుణ్… మీడియా అధినేత మహేంద్ర (సత్యరాజ్) సహాయంతో ఆ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరిస్తాడు. ఆ తర్వాత జరిగే పొలిటికల్ డ్రామాలో వరుణ్ కి ఎదురైన సమస్యలు ఏమిటీ ? అసలు వాసుదేవన్ (నాజర్) వరుణ్ ని ఏ ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు? వరుణ్ తండ్రికి విరోధి అయి ఉండి కూడా మహేంద్ర (సత్యరాజ్) వరుణ్ కి ఎందుకు సాయం చేస్తుంటాడు? మహేంద్రకి, వరుణ్ కి ఉన్న సంబంధం ఏమిటి ? రాజకీయాల గురించి అస్సలు తెలియని వరుణ్ చివరకి యువ ముఖ్యమంత్రిగా ఏమి చేశాడు.. తదితర విషయాలు తెలియాలంటే సినిమా  చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: వరుస విజయాలతో దూసుకువెళ్తున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో.. విజయ్ ఓ యంగ్ సీఎం గా చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన టైమింగ్‌ డైలాగులతో  ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో విజయ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. జర్నలిస్ట్ పాత్రలో నటించిన హీరోయిన్ మెహ్రీన్ కు పెద్దగా స్క్రీన్ టైం కూడా లేదు. ఆమె పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. ఫిమేల్ లీడ్ లో మరో కీలక పాత్రలో కనిపించిన సంచనా నటరాజన్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది. ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన సత్యరాజ్ తన నటనతో ఆకట్టుకుంటారు. ఆయన తన ఎక్స్ ప్రెషన్స్ తో.. కొన్ని ఏమోషనల్ సీన్స్ తో పాటు, పొలిటికల్ డ్రామా సీన్స్ ను కూడా చాలా బాగా పండించారు. ఇక ఎప్పటిలాగే నాజర్ తన గాంభీరమైన నటనతో… వికృతమైన గెటప్ తో ఆకట్టుకోగా… కమెడియన్ ప్రియదర్శి హీరో ఫ్రెండ్ గా, హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్ లో బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకుని.. యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరమీద చూపించారు. సి యస్ సామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. యస్. కృష్ణ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. రేమండ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
చివరగా… ఇదొక ఎంగేజింగ్ పొలిటికల్ త్రిల్లర్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here