F2 – ఫన్ అండ్ ప్రష్ట్రేషన్ లో నూతన్ నాయుడు…!

0
18

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తున్న F2 – ఫన్ అండ్ ప్రష్ట్రేషన్ లో బిగ్ బాస్ నూతన్ నాయుడు కన్పించబోతున్నాడంట. బిగ్ బాస్ షోలో విశాఖపట్నం విశాలాక్షి స్కిట్ తో దుమ్ముదులిపిన నూతన్ నాయుడిని f2 దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఇష్టపడి తన సినిమాలో పెట్టుకున్నాడని తెలుస్తోంది.

f2 లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న నూతన్ నాయుడు తన పాత్రకు రెమ్యునరేషన్ తీసుకోలేదని, ట్రావెల్ టిక్కెట్స్ దగ్గరనుండి బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా తానే పెట్టుకున్నాడని సమాచారం. కధ, కంటెంట్ నచ్చితే ఫ్రీగానే సినిమాలు చేస్తానని నూతన్ నాయుడు చెపుతున్నాడంట.
f2 తో పాటు ఇప్పటికే నూతన్ నాయుడి చేతిలో 14 సినిమాలవరకూ ఉన్నాయంట. ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీతోపాటు, మహేష్ బాబు మూవీలోనూ, రాంగోపాల్ వర్మ మూవీతోపాటు, యాత్ర మూవీలోనూ నూతన్ నాయుడు నటిస్తున్నట్టు సమాచారం. ఎంట్రీ తోనే అదరగొడుతున్న ఈ బిగ్ బాస్ సామాన్యుడే నిజంగా అసామాన్యుడే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here