రివ్యూ: పడి పడి లేచె మనసు

0
55

శర్వానంద్, సాయిపల్లవికి యూత్ లో ఎంతో క్రేజ్ ఉంది. ఇలాంటి జంట తెరమీద కనిపిస్తే ప్రేక్షకులకు కన్నులపంటే. అంతేకాదు… ప్రేమకథలు వెండితెరపై అందంగా చూపించే హను రాఘవపూడితోడు అయితే ఇక ఆ సినిమా ఎంత అందంగా ఉంటుందో అందుకు ఉదాహరనే ‘పడి పడి లేచె మనసు’. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మనసును ఏ మాత్రం దోచిందో చూద్దాం పదండి..!

కథ: స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తున్న సూర్య (శర్వానంద్)…తొలిచూపులోనే మెడికో వైశాలి (సాయిపల్లవి) ప్రేమలో పడిపోతాడు. అయితే తొలుత ఆమె సూర్య ప్రేమను నిరాకరించినా…  చివరికి ఆమెను కూడా ప్రేమలోకి దించుతాడు. ఐతే సూర్య తన తల్లిదండ్రుల జీవితంలో జరిగిన సంఘటల్ని దృష్టిలో ఉంచుకుని… అతను వైశాలితో పెళ్లికి నిరాకరిస్తాడు. ఒకరినొకరు విడిచి ఉండిపోలేనంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఆ స్థితిలో సూర్య.. వైశాలి ఒక ఏడాది పాటు ఒకరికొకరు దూరంగా ఉండి… ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య విడిపోలేనంత ప్రేమ ఉంటే పెళ్లి చేసుకుందాం అనే ఒప్పందానికి వస్తారు. మరి ఏడాది తరువాత  ఇద్దరూ కలిశారా? పెళ్లిచేసుకున్నారా? ఈ క్రమంలో జరిగిన పరిణామాలు ఎంటన్నది తెరమీద చూడాల్సిందే..!

కథ.. కథ విశ్లేషణ: హను రాఘవ పూడి ఎంచుకునే కథ… దానిని నడిపించడానికి రాసుకునే కథనం చాలా ఫ్రెష్ గా ఉంటాయి. పడి పడి లేచే మనసు.. కూడా అంతే ఫ్రెష్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ను లవ్ ఎంటర్ టైనింగ్ గా సాగి… సెకండ్ హాఫ్ లో లవ్ అండ్ ఎమోషన్స్ తో కథనాన్ని నడిపించారు. దాంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. శర్వానంద్, సాయి పల్లవి జంటను చూడటానికి ఈ వీక్ ఎండ్ పర్ ఫెక్ట్ ఛాయిస్.. లెట్స్ గో అండ్ వాచ్..!

నటీనటుల విషయానికొస్తే…శర్వానంద్.. సాయిపల్లవి ఇద్దరూ పోటీ పడి నటించారు. ఒకరు ఎక్కువ తక్కువ అనడానికి లేదు. ఇద్దరూ ఆదరగొట్టేశారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగ పండింది. వీరి పెర్ఫామెన్స్ తో యూత్ ఫిదా కావాల్సిందే.  ఎమోషనల్ సీన్లలో అయితే ఇద్దరూ సూపర్బ్ అనిపించారు. ఇంటర్వెల్ మలుపు దగ్గర సాయిపల్లవి హావభావాలు కట్టి పడేస్తాయి. శర్వా కొన్ని సీన్లలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. ప్రియదర్శి, సునీల్, వెన్నెల కిషోర్  కనిపించినంతసేపు నవ్వించారు. మరళీ శర్మ.. సంపత్, ప్రియ రామన్ తమ పరిధి మేరకు నటించారు.
ప్రేమ సన్నివేశాల్ని అందంగా తీర్చిదిద్దడంలో హను మార్క్ కనిపిస్తుంది. అతడి అభిరుచిని తెరమీద చూడవచ్చు. డైలాగులు బాగున్నాయి. కృష్ణుడు-రుక్మిణిల ప్రేమాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రేమకథను నడిపించిన తీరు బాగుంది.
సాంకేతికంగా ‘పడి పడి లేచె మనసు’ ఉన్నతంగా అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ ప్రేమకథకు సరిగ్గా సరిపోయే సంగీతం అందించాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతంలోనూ మంచి ఫీల్ ఉంది. జేకే ఛాయాగ్రహణం కూడా సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ప్రతి సన్నివేశం ఆహ్లాదంగా అనిపించేలా కెమెరాతో మ్యాజిక్ చేశాడు జేకే. కోల్ కతా నగరాన్ని చాలా బాగా చూపించారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరిని అభినందించాల్సిందే.
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here