రివ్యూ: పందెంకోడి2.. మాస్ ఎమోషనల్ మూవీ

0
14

విశాల్, కీర్తి సురేష్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకున్నారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథేంటంటే… రాజా రెడ్డి (రాజ్ కిరణ్) చుట్టు పక్కల ఏడు ఊరులకు ఆయనే పెద్ద. రాజా రెడ్డి కుమారుడు బాలు (విశాల్) జాతర కోసం ఫారన్ నుంచి ఊరికి వస్తాడు. అయితే ఏడేళ్ల క్రితం.. ప్రతి ఏటా ఆ ఏడు ఊర్లు కలిసి జరుపుకున్నే వీరభద్ర జాతరలో భోజనాల దగ్గర జరిగిన ఓ చిన్నపాటి గొడవలో ఓ రెండు కుటుంబాల మధ్య పగ పెరుగుతుంది. దాంతో ఆ రెండు కుంటుంబాల్లోని ఒక కుటుంబం అయిన భవాని (వరలక్ష్మి శరత్ కుమార్) మనుషులు, ఆవతలి కుటుంబంలోని మనుషులందర్నీ చంపేస్తారు. ఇక చంపాల్సిన వ్యక్తి ఒక్కడు ఉంటాడు. ఆ వ్యక్తికి అండగా రాజా రెడ్డి నిలబడతాడు. ఉన్న ఆ ఒక్క శత్రువుని కూడా చంపాలని భవానీ మనుషులు ప్రతి నిముషం కాచుకొని ఉంటారు. ఈ క్రమంలో రాజా రెడ్డి అతన్ని కాపాడటానికి ఏం చేశాడు..? రాజా రెడ్డి కొరకు మేరకు.. ఆ వ్యక్తిని బాలు(విశాల్) ఎలా కాపాడాడు ? మళ్లీ ఆ కుటుంబాల మధ్యన ఎలాంటి గొడవలు రాకుండా బాలు ఏమి చేశాడు ? పగతో రగిలిపోయే భవానీ చివరకు పగని వదిలేసి మాములు మనిషిగా మారుతుందా ? బాలు తన తండ్రి కోరికను నేరవేరుస్తాడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే !

సినిమా ఎలావుందంటే… రాయలసీమకు చెందిన ఓ పవర్ ఫుల్ కుర్రాడి పాత్రలో నటించిన విశాల్, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచారు. అల్లరి అమ్మాయి అయిన చారుమతి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తీ సురేష్ తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో.. అచ్చం ఓ పల్లెటూరి అమ్మాయిగా, ఎవరికీ భయపడని చలాకీ అమ్మాయిలా చాలా బాగా నటించింది. హీరోకి తండ్రి పాత్రలో నటించిన రాజ్ కిరణ్ ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ఏడు ఊరులకు పెద్దగా.. ఎలాంటి గొడవలు జరగకుండా తాపత్రయపడే ఓ నాయకుడిగా ఆయన చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన నటన చాలా ఎమోషనల్ గానూ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పగతో రగిలిపోయే ఆడదానిలా.. శత్రువు వంశంలో ఎవ్వర్ని బతకనివ్వకూడదని పట్టు బట్టిన అమ్మాయి పాత్రలో ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు ఎన్ లింగుస్వామి మొదటి అర్ధభాగాన్ని సరదాగా, కొంచెం ఎమోషనల్ గా నడిపిన ఆయన సెకండాఫ్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేశారు.
దర్శకుడు లింగుస్వామి కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు. శక్తివెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా పల్లెటూరి విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. కె ఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here