1300 మంది డాన్సర్స్ తో విజువల్ ఫీస్ట్ గా రూపొందిన ‘మర్ద్ మరాఠా’ సాంగ్ ని విడుదల చేసిన ‘పానిపట్‌’ చిత్ర యూనిట్

0
174

భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం(14 జ‌న‌వ‌రి 1761 ) కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’. స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్‌, రోహిత్‌ షెలాత్కర్‌ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ పార్వతీబాయిగా, మరియు సంజయ్‌దత్‌ ఆహ్మద్‌ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్‌ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్‌ ట్రైలర్‌ కి దేశ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా భారీ విజువల్స్‌, రీరికార్డింగ్‌, ఆర్ట్‌ వర్క్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌ డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి ‘మర్ద్ మరాఠా’ సాంగ్ ని ముంబాయి లోని సిద్ది వినాయక మందిరంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘మర్ద్ మరాఠా’ సాంగ్ భారీ స్థాయిలో చిత్రీకరించబడింది, బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద గణేష్ విగ్రహం, పేష్‌వై వాతావరణం నేపథ్యంలో పూణేకు చెందిన లెజిమ్ నృత్యకారులు, అథెంటిక్ బుల్ డాన్సర్లతో సహా 1300 మందితో ఈ పాటను విజువల్ గా చాలా గ్రాండియర్ గా చిత్రీకరించారు. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌ రాజు ఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను 13 రోజులలో కర్జాత్‌లోని శనివార్ వాడా లోని రీగల్ లైఫ్-సైజ్ సెట్‌లో చిత్రీకరించారు, ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ నిర్మించారు. హిందీ-మరాఠీ ఫీల్ ఉన్న పాట ఇది. ఈ పాట‌లో అర్జున్ కపూర్, కృతి సనోన్, మోహ్నీష్ బహల్, పద్మిని కొల్హాపురే న‌టించారు. అజయ్-అతుల్ ఈ గీతాన్ని స్వరపరిచారు. ఈ సందర్భంగా…

మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అజయ్-అతుల్ మాట్లాడుతూ – సాంప్రదాయ ట్యూన్ లోనే ఈ హై-ఎనర్జీ ట్రాక్‌ను కంపోజ్ చేయడం జ‌రిగింది. ఈ పాట మరాఠా పాలన యొక్క గొప్పతనాన్ని తెలియ‌జేస్తుంది. వయస్సు, సంగీతంలో అభిరుచితో సంబంధం లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్షకులు ఆనందించే పాటను సృష్టించాలని , ‘మర్ద్‌ మరాఠా’ ను అందరికీ నచ్చే విధంగా కంపోజ్ చేశాం ` అన్నారు.

దర్శకుడు అశుతోష్ గోవారికర్ మాట్లాడుతూ – “ ‘మర్ద్‌ మరాఠా హై ఎన‌ర్జీ సాంగ్‌. ఇది మరాఠా పాలన యొక్క సుసంపన్నతను తెలియ‌జేస్తుంది. అలాగే పేష్వాసులు, మరాఠా సర్దార్లతో పాటు హిందు-ముస్లిం, ఆర్మీ రెజిమెంట్లకు ఇది ఒక‌ ట్రిబ్యూట్ లా ఉంటుంది. సాంప్రదాయ ట్యూన్ ని జోడించి మ్యూజిక్ డైరెక్ట‌ర్స్అజయ్-అతుల్ అద్భుతంగా చేశారు. ఈ పాటలో రాజు ఖాన్ కొరియోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో నాకు ఇష్టమైన ట్రాక్ ఇది“ అన్నారు.

సంజయ్‌దత్‌, అర్జున్‌ కపూర్‌, కృతిసనన్‌, పద్మిని కొల్హాపురి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం : అజయ్‌-అతుల్‌, కెమెరా : సి.కె.మురళీధరన్‌, ఎడిటింగ్‌ : స్టీవెన్‌ బెర్నార్డ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌, యాక్షన్‌ : అబ్బాస్‌ అలీ మొఘల్‌, బ్యానర్స్‌ : అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌, ప్రొడ్యూసర్స్‌ : సునీతా గోవారికర్‌, రోహిత్‌ షెలాత్కర్‌. దర్శకత్వం : అశుతోష్‌ గోవారికర్‌.

Panipat’s First Song – ‘Mard Maratha’ Boasts Of A Whopping 1300 Dancers Defining Opulence At Its Best

Ashutosh Gowariker’s upcoming War Epic – Panipat, featuring some of the most talented actors of the industry, is undoubtedly one of the most hotly-anticipated film of the year.

With its historical setting and the majestic grand sets, as seen in the trailer of the film, Panipat has already captivated audiences and now the film’s First track – ‘Mard Maratha’ is all set to release.

‘Mard Maratha’ is shot on an extensive scale, replete with Peshwai ambience, a grand Ganesh idol in the background, a whopping 1300 dancers, including lejhim dancers from Pune and authentic bull dancers.

Choreographed by Raju Khan, the song was shot across 13 days, at the regal life-size set of Shaniwar Wada in Karjat, which was constructed by art director Nitin Desai for the film. A refreshing song with a mix of Hindi-Marathi feel to it, ‘Mard Maratha’ features some of the pivotal actors of the film like Arjun Kapoor, Kriti Sanon, Mohnish Bahl, Padmini Kolhapure and is composed by the maestros – Ajay-Atul.

Speaking about composing this high-energy track with traditional flavour to it, the musician duo said, “The song celebrates the richness of the Maratha regime. We wanted to create a song which not only has a traditional feel to it but can also be enjoyed by all kinds of audiences, regardless of their age and taste in music. So, keeping that in mind we have created ‘Mard Maratha’ in such a way that it appeals to one and all.”

The duo further adds, “The energy of the song and the way Ashu Sir has shot it, brings out the forgotten opulence of the Maratha regime and is indeed a visual treat.”

Speaking about it director Ashutosh Gowariker, says ‘Mard Maratha is a high-energy song, which encapsulates the opulence of Maratha regime and pays tribute to the brave Peshwas and their Maratha Sardars, as well as the various army regiments, including Hindus, Muslims and different castes. Ajay-Atul have done a fantastic job of adding a traditional flavor to the song, along with giving it a universal appeal. Raju Khan’s choreography is outstanding. It’s my favorite track from the film!!”

The film is based on the Third Battle of Panipat, which is one of the most epic battles in the history of India that took place on 14 January 1761 at Panipat.

The action-packed period drama is produced by Sunita Gowariker and Rohit Shelatkar’s company – Vision World, features Sanjay Dutt, Arjun Kapoor and Kriti Sanon in lead roles. Panipat is a Reliance Entertainment Worldwide release. Helmed by Ashutosh Gowariker, the film is poised to release on December 6, 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here