‘విక్కీ ది రాక్ స్టార్’ నుంచి పాట విడుదల

0
35

‘విక్కీ ది రాక్ స్టార్’ నుంచి ‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ పాట విడుదల

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తుండగా.. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు అందించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రేమలోని మాధుర్యాన్ని చూపించేలా లవ్ షేడ్‌ను విడుదల చేయగా విశేష స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు.

‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ అంటూ సాగే ఈ పాటను కాసేపటి క్రితమే మేకర్లు రిలీజ్ చేశారు. ఈ పాటలో భగ్న ప్రేమికుడి బాధను చూపించారు. ఈ బ్రేకప్ సాంగ్ గుండెలను పిండేసేలా ఉంది. సునీల్ కశ్యప్ అందించిన బాణీ.. రాంబాబు గోసల సాహిత్యం, కపిల్ కపిలాన్ గాత్రం అందరి హృదయాలను టచ్ చేస్తోంది.

గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో, ఫస్ట్ షేడ్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని ఇప్పటికే వదిలిన అప్డేట్స్ తెలుపుతున్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

సాంకేతిక వర్గం
రచన & దర్శకత్వం : సిఎస్ గంటా
బ్యానర్: స్టూడియో87 ప్రొడక్షన్స్
నిర్మాత: ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సుభాష్, చరిత
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రాఫర్‌: భాస్కర్
ఎడిటర్: ప్రదీప్ జంబిగా
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్యామల చంద్ర
డిజైనర్: TSS కుమార్
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Pilla Nuvvu Naaku Praaname, the first single from Vikky The Rockstar released

 

Vikky The Rockstar is an intriguing, new-age film starring Vikram, Amrutha Chowdary in lead roles and is written and directed by CS Ganta. Vardhini Nuthalapati is presenting the film and it’s produced by Flight Lieutenant Srinivas Nuthalapati (ex-IAF) under Studio87 Productions. Subhash and Charitha are the executive producers with Baskar cranking the camera. Sunil Kashyap has composed the music for the film.

A recent promo, First Shade, received positive responses all over and created curiosity around the film. In addition, another glimpse of the film – Love Shade, the first look poster and the motion poster video furthered the expectations surrounding it. A new single from the film was launched earlier today.

Titled Pilla Nuvvu Naaku Praaname, the song crooned by Kapil Kapilan is lyricised by Rambabu Gosala and composed by Sunil Kashyap. It’s a breakup number focusing on the agony of a grief-stricken lover that has struck a chord with music buffs. The film, which has wrapped its shoot, is being made on a lavish scale without any compromises. The post-production formalities are progressing at a brisk pace.

The promos confirm that Vikky The Rockstar is a one-of-a-kind film to come out of the industry. The makers are confident about catering to the tastes of current-day audiences. The release date will be announced shortly.

Technical Crew:
Writer, Director: CS Ganta
Banner: Studio87 Productions
Producer: Flight Lieutenant Srinivas Nuthalapati(ex-IAF)
Executive Producers: Subhash, Charitha
Music: Sunil Kashyap
Cinematographer: Baskar
Editor: Pradeep Jambiga
Production Executive: Shyamala Chandra
Designer: TSS Kumar
PRO: Sai Satish, Parvataneni Rambabu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here