ప్లాన్-బి… ఆసక్తికరమైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

0
213

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందుకే దర్శకులు, నిర్మాతలు అలాంటి చిత్రాలను తీసి బాక్సాఫీస్ బద్దలు కొట్టాలని చూస్తుంటారు. తాజాగా అలాంటి  చిత్రాన్నే నూతన దర్శకుడు కె.వి. రాజమహి… శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర,  శాని, నవీనారెడ్డి ముఖ్య తారాగణంతో ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకంపై “ప్లాన్-B’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర్రాన్ని ఎ.వి.ఆర్. నిర్మించారు. సెన్సార్ బోర్డ్ సబ్యులతో ప్రశంసలు అందుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం… ఆడియన్స్ ని ఈమాత్రం థ్రిల్ కి గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: విశ్వనాథ్(కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి) ఓ సివిల్ లాయర్. తను ఓ ల్యాండ్ డీల్ చేసి.. రూ.10 కోట్ల హీరోయిన్ తండ్రికి ఇస్తాడు. అనంతరం ఓ ముఖ్యమైన పని మీద ముంబాయికి బయలుదేరుతాడు. ఇంతలో లాయర్ విశ్వనాథ్ ని ఎవరో హత్య చేస్తారు. అలానే ల్యాండ్ డీల్ లో వచ్చని 10 కోట్లను హీరోయిన్ ఇంట్లో నుంచి తస్కరిస్తారు. ఆ తరువాత రిషి అనే మరో వ్యక్తి కూడా అనుమానస్పదంగానే మరణిస్తాడు. మరి ఇలా వరుసగా అనుమానస్పదమైన హత్యలు… 10 కోట్ల దొంగతనం ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ, కథనం విశ్లేషణ: సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమాలు ఆద్యంతం ప్రేక్షకులను కుర్చీలో కట్టిపడేయాలంటే… పకడ్బందీగా కథ… కథనం రాసుకొని ఉండాలి. నూతన దర్శకుడు రాజమహి కూడా ఇదే చేశారు. తను రాసుకున్న కథలో ఎక్కడా డీవియేట్ కాకుండా… తను అనుకున్నది అనుకున్నట్తు ఎక్కడా బోరింగ్ లేకుండా.. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ను తెరకెక్కించారు. లాయర్ విశ్వనాథ్ హత్య మొదలుకొని… ఆ తరువాత 10కోట్ల దొంగతనం, రిషి హత్య, వీటన్నింటికీ కారణం హీరో గౌతమ్ కారణము అని అనుమానం కలిగించడం… ఆ తరువాత క్లయిమాక్స్ లో అసలు ట్విస్ట్ రివీల్ చేయడం లాంటి వన్నీ ఉత్కంఠ భరితంగా సాగి.. ఆడియన్స్ ని థ్రిల్ కు గురి చేస్తాయి.

స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటాడు. రెండు పాత్రలోనూ ఎంతో వెరీయేషన్ చూపించాడు. అలానే గౌతమ్ పాత్ర వేసిన సూర్య వశిష్ట కూడా నెగిటివ్ రోల్ లో  మెప్పించారు. సిన్సియర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు పోషించిన మురళి శర్మ, నటుడు రవి ప్రకాష్ పాత్రలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఇన్వెస్టిగేషనే మెయిన్ పాయింట్ కావడంతో సినిమా మొదలుకొని…. ఎండ్ కార్డు పడేవరకు వీరి క్యారెక్టర్స్ ని డిజైన్ చేసాడు దర్శకుడు. మిగితా పాత్రలు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.

దర్శకునికి ఇది డెబ్యూనే అయినా సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని… ట్విస్టులను ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా రాసుకుని తెరకెక్కించాడు. కథ క్లయిమ్యాక్స్ కి వెళ్లేంత వరకూ అసలు విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేశారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు రాజమహి. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగా ఉంది. ఇది సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కాబట్టి… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానం. చిత్రానికి తగ్గట్టుగానే ఉంది. సినిమాటోగ్రఫి రిచ్ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఇలాంటి జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఓసారి చూసి.. థ్రిల్ కావొచ్చు. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here