ప్రజా నాట్య మండలి కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన “ప్రశాంత్ గౌడ్”

0
91

కరోనా మహమ్మరి విలయతాండవంలో కొట్టుకు పోతున్న పేద బ్రతుకుల పాలిట కల్పతరువుల మారారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ,సార్ధక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్.ఇటీవలే ఆయన ప్రజానాట్యమండలి కళాకారులకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” దర్శకుడు బాబ్జి సూచన మేరకు ప్రజా నాట్య మండలి కళాకారులకు బియ్యం ,నిత్యావసర సరుకులు సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు సమాజాన్ని చైతన్య పరుస్తూ , ప్రజల కోసం పనిచేసే కళాకారులు ఆకలిబాదతో అలమ టిస్తుండటం భావ్యం కాదని భావించి వారికి ఈ నిత్యవసర సరుకులు పంపిణీ చేసాం. అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత వి.వి.ఏస్. వర్మ, తెలంగాణ ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె, నర్సింహ,రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్రా చారి, డి.వేణుగోపాలచారి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here