‘ప్రేక్షకుడు’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

0
187

నూతన నటీనటులను తెలుగుతెరకు పరిచయం చేస్తూ రేఖ సాయిలీల ప్రొడక్షన్స్‌ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేక్షకుడు’. కె.వి.రెడ్డి దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం లోగోను ఫిల్మ్‌ ఛాంబర్‌లో న్యాయవాది ఎస్‌.వరలక్ష్మి విడుదల చేశారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘పశ్చిమ గోదావరి జిల్లాలో చలమయ్యగారి మిఠాయికొట్టు చాలా ఫేస్‌ వాటిలో స్వీట్స్‌లాగే ఈ చిత్రం మధురంగా ఉంటుంది. ఈ నెల 25 నుంచీ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. అంతర్వేది, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లో ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. మున్నాకాశీ చక్కని బాణీలు అందిస్తున్నారు’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీవాణి, మున్నాకాశీ, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here