లవ్ ఎంటర్ టైనర్ ‘ప్రేమ పిపాసి’

0
336

లవ్ ఎంటర్టైన్ మెంట్ చిత్రాలకు యూత్ లో బాగా ఆదరణ వుంది. దానికి తోడు బోల్డ్ కంటెంట్ తో కూడిన రొమాన్స్ వుంటే.. యూత్ ని థియేటర్లకు రప్పించొచ్చు. తాజాగా విడుదలైన ‘ప్రేమ పిపాసి’ కూడా ఇలాంటి యూత్ బేస్ సినిమానే. ఈ చిత్రానికి ఆర్కే నిర్మాత. డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జీపీఎస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. మురళీరామస్వామి (ఎమ్‌.ఆర్‌) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. మరి యూత్ ను బోల్డ్ కంటెంట్ తో ఏమాత్రం ఆకర్పించిందో చూద్దాం పదండి.

కథ: బావ (జీపీఎస్) కనిపించిన అమ్మాయినల్లా ఫ్లట్ చేస్తూ… వారిని చిలకొట్టుడు కొడుతూ సరదాగా జీవితం కానిచ్చేస్తుంటాడు. అలా చాలా మంది అమ్మాయిలను తన ట్రాప్ లోకి దించేసి ‘పని’ కానిచ్చేసి… చేతులు దులిపేసుకుంటూ వెళుతుంటాడు. అలా వెళ్లే క్రమంలో మ్యాథమ్యాటిక్స్ అంటే అస్సలు పడిని ఓ అమ్మాయి తన వద్దకు ట్యూషన్ కు వస్తుంది. ఆ అమ్మాయిని కూడా తన చాతుర్యంతో ముగ్గులోకి దించుతుండగా… ఆమె తండ్రి సుమన్ వచ్చి రక్షిస్తాడు. అదే సమయంలో హీరోయిన్ బాలా (కపిలాక్షి మల్హోత్ర) ని ప్రేమిస్తుంటాడు. మరి ఆమె ప్రేమను చివరకు దక్కించుకున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఓ ఫ్రస్టేటెడ్ లవర్.. ప్యూర్ లవ్ కోసం వెతికే ప్రయాణమే ప్రేమపిసాసి మెయిన్ లైన. దాని చూట్టూ రాసుకున్న రొమాంటిక్.. బోల్డ్ కంటెంట్ సీన్స్ అన్నీ యూత్ ను దృష్టిలో వుంచుకుని అల్లుకున్నవే. ఓ డిఫరెంట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మొదటి హాఫ్ అంతా… హీరో జీపీఎస్.. అమ్మాయిలను ముగ్గులోకి దించడం… ఆ తరువాత వాళ్లను వదిలించుకోవడం లాంటి సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. అమ్మాయిలను ఎలా పడేయాలనే కాన్సెప్ట్ తో మొదటి అర్ధ భాగం ముగించిన దర్శకుడు.. ద్వితీయార్థంలో హీరో అంతలా ఫ్రస్టేట్ అవ్వడానికి గల కారణాలను వివరిస్తూనే.. అదే సమయంలో ప్యూర్ లవ్ ను తన ప్రేయసి నుంచి పొందడడానికి పడే తపన వున్న ప్రేమికునిగా హీరో పాత్రను తీర్చిదిద్దన తీరు బాగుంది. అతను అలా అమ్మాయిలను వాడుకొని వొదిలేయడానికి గల కారణాన్ని కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో చెప్పడం… బాగుంది. నేటితరం అమ్మాయిలు అబ్బాయిలను ఎలా మోసం చేస్తున్నారనే దాన్ని లైటర్ వేలో చూపించారు దర్శకుడు. ఓవరాల్ గా ‘ప్రేమ పిపాసి’ యూత్ ను ఎంటర్టైన చేస్తుందనడంలో సందేహం లేదు
హీరో జీపీఎస్ థియేటర్ ఆర్టిస్ట్ కావడంలో వేరియేషన్స్ వున్న పాత్రలను చాలా అవలీలగా చేసేశాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా కొత్త వాడైనా చాలా ఈజీగా నటించేశాడు. అలానే హీరోయిన్లు కూడా తనకు ఇచ్చిన పాత్రలను అలా అవలీలగా క్యారీ చేశారు. సుమన్ కూడా తన పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక హీరో ఫ్రేండ్స్ పాత్రల్లో నటించిన వారంతా కామెడీతోనూ… కాలేజీలో నటించిన అబ్బాయి సీరియస్ పాత్రలోనూ బాగానే చేశారు.
దర్శకుడు రామస్వామి.. ఓ ఫ్రస్టేటెడ్ లవర్… తన ఫ్రస్టేషన్ తో అమ్మాయిలను ఏవిధంగా వాడుకొని వదిలేయగలడు.. అలా ఓ జెన్యూన్ ప్యూర్ లవ్ కోసం ఏవిధంగా తాపాత్రయపడగలడనే దాన్ని లైన్ గా తీసుకుని…దాని చూట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే చాలా కన్వెన్సింగ్ గా వుంది. హీరో పాత్రమీదనే సినిమా మొత్తం నడుస్తుంది కాబట్టి… తన పాత్రను ఎక్కడా తగ్గనీయకుండా క్యారీ చేసిన విదానం బాగుంది. సంగీతం బాగుంది. లిరిక్స్ బాగున్నాయి. యూత్ కు కనెక్ట్ అయ్యేలా వున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుంటే బాగుండు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here