నా కెరీర్ పై భయం వేసింది- వింకింగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్

0
75

త్వరలో తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ తెరుచుకుంటున్న నేపథ్యంలో వచ్చే 30వ తేదీన నాలుగు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వాటిలో యంగ్ హీరో తేజ సజ్జ, వింకింగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటిస్తున్న  చిత్రం “ఇష్క్” ఒకటి. ఈ చిత్రం ఈ నెల 30న విడుదలవుతున్న సందర్భంగా ప్రియా ప్రకాష్ వారియర్ మీడియా తో ముచ్చటించారు.. ఆ విశేషాలు ఏంటో చూద్దాం పదండి…

“ఇష్క్ సినిమా నాకు ఒక ఊహించని రకంగా వచ్చిన మూవీ. మాములుగా అయితే ప్రతీ సినిమాకి కొన్ని నెలల గ్యాప్ నేను తీసుకొని మధ్యలో చాలా సార్లు డిస్కషన్స్ పెట్టి ఓకే చేస్తాను. కానీ ఈ సినిమాకి మాత్రం రెండు రోజుల్లోనే ఓకే చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మళయాళంలో ఈ సినిమా చూసాను అందుకే అంత త్వరగా ఓకే చేశాను.మళయాళం వెర్షన్ వరకు ఆమె తన రోల్ కి తగ్గట్టుగా తాను చేసింది.. కానీ నేను అలా చెయ్యలేదు. ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్తే అదే చేశాను.. ఇంకా రాజు గారు అయితే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. సో దాని వల్ల ఇంకా బాగా చేయగలిగాను. చెక్ సినిమాలో నేను కాసేపు మాత్రమే కనిపించే రోల్ చేశాను. ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సో దీనినే నా ఫుల్ ఫ్లెడ్జ్ గా డెబ్యూ సినిమా అనుకుంటాను.
మళయాళ సినిమా కంటెంట్ టాలీవుడ్ సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానిపై ఏమన్నా చెప్పండి
మళయాళ సినిమా అంతా కంటెంట్ బేస్ లో ఉంటుంది. కానీ టాలీవుడ్ ఆడియెన్స్ దానితో పాటు ఇంకా మంచి కమెర్షియల్ ఎలిమెంట్స్ కోరుకుంటారు. మంచి పాటలు కానీ… ఫైట్స్ కానీ అలా. సో రెండింటిలోనూ నటించడానికి నేను ఇష్టపడతాను ఇంకా ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యాలని ఉంటుంది. ఈ సినిమాలో నా రోల్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అంటే సినిమా ఆ టైప్ లో ఉంటుంది. రెగ్యులర్ లవ్ డ్రామాల్లా కాకుండా రొమాంటిక్ థ్రిల్లర్ లా ఈ సినిమా ఉంటుంది. ప్రెజెంట్ యూత్ లో జరుగుతున్న ఓ అంశాన్నే మేము లైట్ లో చూపిస్తున్నాము. అదే చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ప్రస్తుతానికి నాకు మంచి ప్రాజెక్ట్స్ నుంచే ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ ఆఫర్స్ వచ్చినప్పుడు అంతా ఇక్కడా చేస్తాను అలాగే మళయాళంలో వచ్చినప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా చేస్తాను. తెలుగు ఎవరైనా మాట్లాడేది అర్ధం చేసుకోగలను. అలాగే మాట్లాడ్డం కూడా కొంచెం తెలుసు. ప్రస్తుతానికి నేర్చుకుంటున్నాను. ఇంకో రెండు సినిమాలు అలా చేస్తే ఇంకా మంచిగా తెలుగులో మాట్లాడతాను. వింకింగ్ తర్వాత వచ్చిన ఫేమ్ తో చాలానే ఆఫర్స్ వచ్చేసాయి కానీ చదువుని బ్యాలన్స్ చేస్తూ చాలా పెద్ద ఆఫర్స్ నే వదిలేసాను. ఇంకా అలా ఫేమ్ వచ్చాక ఈ ప్యాండమిక్ మూలాన చాలా సినిమాలు షూటింగ్ ఆగిపోయింది. రిలీజ్ డేట్స్ ఆగిపోయాయి. అదే కాస్త బాధ కలిగించింది, ఎన్నో ఆలోచనలు వచ్చేవి నా కెరీర్ ఆగిపోయిందా? ప్రేక్షకులు నన్ను మర్చిపోతారా? అనుకోని ఫీల్ అయ్యాను. ఇందులో నా కోస్టార్ తేజ చాలా యాక్టీవ్ గా ఉంటాడు. సెట్స్ లో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ సెట్ అంతటినీ లైవ్ లో ఉంచుతాడు, ఇంకా నాకు తెలుగులో కూడా చాలా హెల్ప్ చేసాడు. డైరెక్టర్ రాజు గారి వర్క్ తో చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను. ముఖ్యంగా అయన నాకు ఫ్రీడమ్ ఇచ్చేసారు. నా రోల్ కి తగ్గట్టుగా నేను చెయ్యగలనని చెప్పడంతో నేను చాలా ఫ్రీ ఫీలయ్యాను. ఇంకా అయన చాలా కూల్ గా కామ్ గా ఉంటారు. ఎలాంటి స్ట్రెస్ కానీ ప్రెజర్ కానీ పెట్టరు. ప్రస్తుతానికి అయితే తెలుగులో ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ చేస్తున్నా. ఇంకా అది ఆఫీషియల్ అనౌన్సమెంట్ రాలేదు. మళయాళంలో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కోసం చూస్తున్నా.. ఇంకా హిందీలో అయితే రెండు సినిమాలు ఉన్నాయి. వాటి నుంచి అప్డేట్స్ రావాల్సి ఉంది” అంటూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here