చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ప‌ల్స‌స్ కేంద్రాలు కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ‌కు అంతా సిద్ధం

0
510

న్యూఢిల్లీలో సీఎం ర‌మ‌ణ్‌సింగ్‌తో సీఈవో గేదెల శ్రీనుబాబు భేటీ
హెల్త్‌కేర్‌, అగ్రిక‌ల్చ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ హిందీలో కావాల‌ని కోరిన సీఎం
ఏడాదిలోగా 3 కేంద్రాల్లో 2వేలు ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న శ్రీనుబాబు
ప‌ల్స‌స్ ఏర్పాటుకు అన్ని విధాల స‌మ‌క‌రిస్తామ‌ని హామీ ఇచ్చిన సీఎం
ప‌ల్స‌స్ కార్య‌క‌లాపాలు వివిధ రాష్ర్టాల‌కు ఇప్ప‌టికే విస్త‌రించాయి. తాజాగా చ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ ప‌ల్స‌స్ అడుగుపెట్టేందుకు మార్గం సుగ‌మం అయ్యింది. చ‌త్తీస్‌గ‌డ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ ర‌మ‌ణ్‌సింగ్ తో ప‌ల్స‌స్ సీఈవో డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్‌సింగ్ మాట్లాడుతూ వైద్యారోగ్య ర‌క్ష‌ణ‌, వ్య‌వ‌సాయ‌రంగాల‌కు సంబంధించిన స‌మాచారం త‌మ ప్రాంతీయ భాష అయిన హిందీలో అంద‌రికీ అందుబాటులో తీసుకురావాల‌నే యోచ‌న‌లో ఉన్నామ‌ని చెప్పారు. గ్రామీణ భార‌తానికి అత్య‌వ‌స‌ర‌మైన ఈ స‌మాచారం ఇంగ్లీష్ నుంచి ప్రాంతీయ భాష‌ల‌లోకి అనువ‌దించ‌డంలో ప‌ల్స‌స్‌, ఒమిక్స్ సంస్థ‌లు ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాతి గాంచ‌డంతో ఈ సంస్థ‌ల కార్య‌క‌లాపాలు త‌మ రాష్ర్టంలో ఆరంభించాల‌ని కోరుతున్నామ‌న్నారు.
వైద్యారోగ్య ర‌క్ష‌ణ‌, వ్య‌వ‌సాయ సంబంధిత స‌మాచారాన్ని ఇంగ్లీష్ నుంచి హిందీలో అనుదించి అన్‌లైన్లో ఉంచ‌డం వ‌ల్ల త‌మ రాష్ర్ట యువ‌త‌కు ఎన‌లేని స‌హాయం చేసిన‌వార‌వుతార‌ని సీఎం చెప్పారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యువ‌త‌కు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల‌కు మందికి స్కై స్మార్ట్‌ ఫోన్లు అందించామ‌ని, వీరంతా త‌మ మొబైల్‌లోనే ఈ స‌మాచారం తెలుసుకోగ‌ల‌ర‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.
దేశ‌వ్యాప్తంగా ఐటీ కారిడార్ల‌లో సెజ్‌ల‌ను ప‌ల్స‌స్ నెల‌కొల్పి, దిగ్విజ‌యంగా ప‌ల్స‌స్ నిర్వ‌హిస్తోంద‌ని, ఇలాగే మా చ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ సెజ్‌ల‌ను ప‌ల్స‌స్ సంస్థ ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల స‌హాయ స‌హ‌కారాలు పూర్తిగా అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఆరోగ్య‌వంత‌మైన స‌మాజాన్ని నిర్మించేందుకు త‌న సంస్థ‌ల ద్వారా కృషి చేస్తున్న డాక్ట‌ర్ శ్రీనుబాబు ప‌ల్స‌స్ కార్య‌క‌లాపాలలో పాలుపంచుకునేందుకు చ‌త్తీస్‌గ‌ఢ్ యువ‌త ఉత్సాహంగా ఎదురుచూస్తోంద‌న్నారు ముఖ్య‌మంత్రి.
ఈ సంద‌ర్భంగా ప‌ల్స‌స్ సీఈవో డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ “ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ ర‌మ‌ణ్‌సింగ్ నాయ‌క‌త్వంలో ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతున్న చ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ర్టం ఇప్పుడు పెట్టుబ‌డుదారుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారింది“ అని అన్నారు.“ స్థానిక యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు చ‌త్తీస్‌గ‌ఢ్ అనుకూల‌మైన‌ద‌ని, ఇక్క‌డ యువ‌త‌కు ప్ర‌భుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్ల‌తో ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం నిర్మిత‌మ‌వుతుంద‌ని “ చెప్పారు. సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీస్ పార్స్క్ ఆఫ్ ఇండియా, ప‌ల్స‌స్‌, ఒమిక్స్‌ల సార‌ధ్యంలో రానున్న ఏడాదిలో చ‌త్తీస్‌గ‌డ్‌లోని దంతేవాడ‌, రాజ్‌నంద‌గావ్‌, రాయ్‌పూర్‌ల‌లో రెండువేల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నామ‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ విశాఖ‌ప‌ట్నం, తెలంగాణ‌లోని సంగారెడ్డిలో 4000 మందితో కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు ఇదివ‌ర‌కే ప్రోత్సాహాక అనుమ‌తులు ల‌భించాయ‌ని చెప్పారు.
హెల్త్‌కేర్‌, హెల్త్ ఇన్ఫ‌ర్మేటిక్స్ రంగాల‌లో ప‌నిచేస్తున్న కెన‌డాకు చెందిన ప‌ల్స‌స్ కంపెనీ త‌న కార్య‌క‌లాపాలు యూకే, సింగ‌పూర్‌, బెల్జియంల‌లో నిర్వ‌హిస్తోంది. ప‌ల్స‌స్ కంపెనీని ఒమిక్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ టేకోవ‌ర్ చేసి.. భార‌త‌దేశం కేంద్రంగా త‌న కంపెనీ కార్య‌క‌లాపాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించింది. దేశంలోని హైద‌రాబాద్‌, చెన్నై, ఢిల్లీ, విశాఖ‌ప‌ట్నం కేంద్రాలుగా ఏడు సెజ్ యూనిట్ల‌లో 5 వేల మందికి పైగా ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తోంది. హెల్త్‌కేర్‌, హెల్త్ ఇన్ఫ‌ర్మాటిక్స్ రంగాల స‌మాచారాన్ని సేక‌రించేందుకు, ఆన్లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిపుణులు, శాస్ర్త‌వేత్త‌లు, వైద్య‌ప‌రిశోధ‌కులతో స‌మావేశాలు నిర్వ‌హించి ..వాటి సారాంశాన్ని ఆన్‌లైన్‌లో ప్ర‌చురిస్తోంది. దాదాపు 40 దేశాల‌లోని క్ల‌యింట్‌లు ప‌ల్స‌స్‌ సేవ‌లు వినియోగించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here