మే 12 నుండి బ్యాంకాక్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి  శ్రీను చిత్రం

0
85
మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి  హైద‌రాబాద్‌లో మేజ‌ర్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. త‌దుప‌రి షెడ్యూల్ బ్యాంకాక్‌లో మే 12 నుండి జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా ..
 
 చిత్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ “మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా అంటే సినిమాపై ఎన్ని అంచ‌నాలుంటాయో అంద‌రికీ తెలిసిందే. ఈ అంచ‌నాల‌కు ధీటుగా సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. హైద‌రాబాద్‌లో మేజ‌ర్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఫ్యామిలీ స‌న్నివేశాల‌ను, అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో యాక్ష‌న్ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. ఈ 20 రోజుల షెడ్యూల్‌లో  రామ్ చరణ్, ప్ర‌శాంత్, స్నేహ‌, కియరా అద్వానిల‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై స్న‌నివేశాల‌ను చిత్రీక‌రించారు.  అంత‌కు ముందు చిత్రీక‌రించిన 15 రోజుల షెడ్యూల్‌లో వివేక్ ఒబెరాయ్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై సన్నివేశాల‌ను చిత్రీక‌రించాం. త‌దుప‌రి షెడ్యూల్ కోసం యూనిట్ బ్యాంకాక్ వెళుతుంది. బ్యాంకాక్ షెడ్యూల్ 15 రోజుల పాటు ఉంటుంది.  మే 12 నుండి ఈ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంది. మెగాభిమానులు, ప్రేక్ష‌కులను అల‌రించేలా రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం“ అన్నారు. 
 
రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్:  జీవ‌న్‌, పి.ఆర్‌.ఒ : వ‌ంశీ కాకా, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.
 
Ram Charan-Boyapati Srinu complete Hyderabad schedule of their upcoming film
 
Director Boyapati Srinu’s next with Mega Powerstar Ram Charan is quickly progressing. The team of the film, a production of DVV Danayya on his banner DVV Entertainments, just wrapped up a major schedule in Hyderabad. The next schedule has been planned in Bangkok and will begin on May 12.
 
Speaking about the same, producer DVV Danayya said, “The coming together of a director and actor who are dear and near to the masses is quite an exciting prospect for me and I know the film will be a highly anticipated one. And we are leaving no stone unturned to make the best out of the crazy combination. In our schedule in Hyderabad, we shot family sequences at Ramoji Film City and action scenes at Aluminium Factory. The unit is now traveling to Bangkok, where they will shoot for around 15 days. This film will be a treat for mega fans and will see Ram Charan in a new avatar. With family emotions and power packed action intertwined in the film, we are making a pakka commercial entertainer.”
 
In this schedule, that lasted over 20 days, Ram Charan, Kiara Advani, Sneha and Prashanth amongst other actors took part. Earlier, Vivek Oberoi shot for around 15 days.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here