రివ్యూ: రణరంగం

0
227

తన సినిమాలతో ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రతి సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ… టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ చిత్రంలో నటించారు. ఇందులో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిలు హీరోయిన్లు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. ఇప్పటికే ట్రైలర్లు, టీజర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం… 90’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించారు. మరి శర్వా ఏమాత్రం ప్రేక్షకుల్ని అలరించాడో చూద్దాం పదండి.

కథ: దేవా(శర్వానంద్) తన మిత్రులతో కలిసి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ బతికే ఓ సామాన్య కుర్రాడు. అలాంటి దేవా 1995 సంవత్సరంలో మధ్య పాన నిషేధంతో సారా బ్లాక్ మార్కెట్ దందా వలన బాగా సంపాదించే అవకాశం ఉండటంతో దేవా ఆ ఇల్లీగల్ బిజినెస్ లోకి దిగి అంచలంచెలుగా ఎదుగుతాడు. ఆలా ఓ సామాన్య కుర్రాడు అందరిని భయపెట్టే గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎలా ఎదిగాడు? ఆలా ఎదిగే క్రమంలో దేవా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటీ? దేవాని మట్టుబెట్టాలని ఎదురుచూస్తున్న శత్రువుల నుండి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథాంశం.

విశ్లేషణ: రణరంగం మూవీ రెండు విభిన్న కాలాలలో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ. 90లనాటి యువకుడిగా, ప్రస్తుతం కాలంలో గ్యాంగ్ స్టర్ గా శర్వా నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాలలో శర్వా ఆకట్టుకుంటాడు. ఇంతకు ముందు శర్వా ఎలాంటి గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించక పోవడంతో ప్రేక్షకులకు ఓ కొత్త భావన కలుగుతుంది. ఇక ఈ కాజల్ డాక్టర్ గా పాత్రకు చక్కగా సరిపోయారని చెప్పాలి. రెండవ సగంలో మాత్రం ఆమె నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన బాగుంది. ఇక మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి 90ల కాలం నాటి ఆమ్మాయిగా ఆ పాత్రకు చక్కగా సరిపోయింది. ప్రతి సన్నివేశంలో ఆమె అమాయకత్వం, క్యూట్ నెస్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు సుధీర్ వర్మ తాను చెప్పాలనుకున్న విషయాన్నీ తెరపై ఆవిష్కరించడంలో విజయం సాధించారు. సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా వున్నాయి. గో అండ్ వాచ్ ఇట్!

ప్లస్ పాయింట్స్:
హీరో, హీరోయిన్ల నటన
సంగీతం
గ్యాంగ్ స్టర్ ని ప్రెజెంట్ చేసిన విధానం
సినెమాటోగ్రపీ

రేటింగ్: 3.5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here