‘ఏయ్… పిల్లా’ అంటున్న రవితేజ సోదరుని కుమారుడు

0
35

మాస్ మహారాజా రవితేజ సోదరుడి కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘ఏయ్… పిల్లా’

మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏయ్… పిల్లా’ టైటిల్ ఖరారు చేశారు.

ఈ సందర్భంగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ ”హృదయానికి హత్తుకునే ఓ అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుబూతి ఇస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 90ల నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.

‘ఏయ్… పిల్లా’ చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు : అన్వర్ , కూర్పు: ప్రసన్న, కళ : చిన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గణేష్ ముప్పానేని.

Ravi Teja’s Nephew, Madhav Debuting As Hero Under Nallamalupu Bujji’s Production

Mass Maharaja Ravi Teja is one of the top stars in Tollywood Now, his nephew, Madhav Bhupathi Raju is all set to make his debut as an actor. His debut project has been officially announced today.

Madhav is the son of Ravi Teja’s brother, and well known actor, Raghu and he is making his debut with a love drama. Madhav’s debut fim has been title “Ey Pilla” and it will be produced by Nallamalupu Bujji under Lakshmi Narasimha Productions. Bhavya is presenting the film.

“Ey Pilla is a feel good love drama. It is near to heart love story which will leave the audience thrilled in the theaters. It is a vintage 90s love drama. The regular shooting will start this September. Top technicians are associated with the project,” the producer, Bujji said.

Miss India runner up Ruben Shekhawat is playing the female lead. Noted director Ramesh Varma is providing the story for this film. Ludheer Baireddy is making his directorial debut with the love drama. Mickey J Meyer is composing the music while Shyam K Naidu is handling cinematography. Anwar is writing dialogues, Chinna is handling the art department and Ganesh Muppaneni is the executive producer.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here