‘రెహెనా ఫాతిమా’ అసలు రూపం ఇదే!

0
689

దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత ఆధ్యాత్మిక చింతన సాధించుకున్న శబరిమలై అయ్యప్ప సన్నిధి.. ఇప్పుడు విచిత్రమైన వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. కేవలం రుతుక్రమం సాకుగా చూపి ఆడవాళ్లను ఇన్నేళ్ళుగా గుడికి దూరంగా పెట్టిన సంప్రదాయవాదులు.. తాజా సుప్రీమ్‌కోర్ట్ తీర్పుతో కంగుతినాల్సి వచ్చింది. ఇదే అదనుగా.. కొందరు కరడుగట్టిన ఫెమినిస్టులు రెచ్చిపోతున్నారు. సమానత్వమనే సామాజిక అస్త్రాన్ని అందిపుచ్చుకుని.. వికృతమైన చేష్టలతో.. పోరాటబాట పట్టేశారు. ఈ క్రమంలో రెహనా ఫాతిమా ప్యారిజాన్ అనే కేరళ కుట్టి ఒకేసారి నాలుగడుగులు ముందుకేసింది.

అయ్యప్ప మాలధారుల దుస్తులేసుకుని ఒక అభ్యంతరకరమైన ఫోజుతో ఫోటో దిగి సోషల్ మీడియాకెక్కింది. అయ్యప్ప భక్తురాలి వేషంలో ఉండాల్సిన భక్తిభావం కంటే ఒక ‘మగరాయుడి’లా కనిపించాలన్న అహంభావమే ఆమెలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈమె పాల్పడ్డ ఈ అకృత్యాన్ని సాటి ఫెమినిస్టులు సైతం నిరసిస్తున్నారు.
తిరుచ్చికి చెందిన 31 ఏళ్ల రెహనా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు. ఇద్దరు బిడ్డల తల్లి కూడా. మోడలింగ్, హక్కుల కోసం పోరాటం ఆమెకున్న మిగతా ప్రవృత్తులు. దేన్నైనా కొట్టినట్టు చెప్పే రెహనా ఫాతిమా ప్యారిజాన్‌కి ఇటువంటి వివాదాలు కొత్త కాదు. గతంలో.. ‘ఆడవాళ్ళ పాలిండ్లు పుచ్చకాయల్లాంటివి’ అంటూ వివాదాస్పద కామెంట్ చేసిన ఒక కేరళ మగ ప్రొఫెసర్‌కి ఘాటుగా జవాబిచ్చింది.

తన వక్షోజాల్ని రెండు పుచ్చకాయలతో కప్పుకుని.. సదరు ఫోటోని ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టేసి.. తన బోల్డ్‌నెస్‌ని చాటుకుంది. అంతకుముందు.. త్రిశూర్‌లో జరిగే సాంప్రదాయ పులివేషాల్లో మగవాళ్లతో కలిసి తానూ పాల్గొంది. 2106లో మోరల్ పోలీసింగ్‌కి వ్యతిరేకంగా జరిగిన ‘కిస్ ఆఫ్ లవ్’ మూమెంట్‌లో సైతం చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడిలా ‘అయ్యప్ప’ వేషంలో దేశం మొత్తాన్నీ ఆకర్షించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here