Review: The Warriorr

0
668

ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) లాంటి బ్లాక్ బస్టర్ తరవాత రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న చిత్రం ది వారియర్ (The Warriorr). ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్ర పోషించారు రామ్. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లింగుస్వామి(Linguswamy) దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు అనగా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయింది. పక్కా మాస్ కమర్షియల్ ఎంట్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

కథ: సత్య(Ram Pothineni) హౌస్ సర్జన్ చేయడానికి కర్నూల్ జనరల్ ఆసుత్రికి వస్తాడు. అక్కడ రేడియో జాకీ విజిల్ మహాలక్ష్మి(Krithi Shetty) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అదే సమయంలో అక్కడ గురు (Aadhi Pinisetty) చేయని అరాచకం అంటూ వుండదు. తన రౌడీయిజంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ… తనకు అడ్డు చెప్పిన వాళ్ళను మట్టుబెడుతూ వుంటాడు. కర్నూలు నగరంలో మామూళ్లు వసూలు చేయడం… నకిలీ మందులు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం లాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటాడు. అలాంటి గురుని… హౌస్ సర్జన్ గా ప్రాక్టీస్ చేసే ఓ సాధారణ వైద్యుడు… IPS గా మారి… అతని ఆగడాలను ఎలా నిలువరించాడన్నదే మిగతా కథ..

కథ… కథనం విశ్లేషణ: పోలీస్ కథలన్నీ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. వాటికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఆడియెన్స్ ను అలరించిచ్చు. దర్శకుడు లింగుస్వామి సత్య లాంటి IPS పాత్రకు ఓ డిఫరెంట్ స్క్రీన్ ప్లేను రాసుకొని అటు క్లాసు… ఇటు మాస్ ఆడియెన్స్ ను అలరించాడు. ఫస్ట్ హాఫ్ లో డాక్టరు పాత్రను క్లాస్ ఆడియెన్స్… సెకెండ్ హాఫ్ లో వచ్చే పోలిస్ పాత్ర మాస్ ఆడియెన్స్ ని అలరిస్తాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర వున్నప్పుడు… విలన్ పాత్ర కూడా అదే రేంజ్ లో వుంటే… పాత్రల్లో సమతూకం వుండి… ఆడియన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. దర్శకుడు ఇందులో అదే చేశాడు. విలన్ పాత్రకు బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చాడు. అందుకే ఇందులో సత్య, గురు పాత్రలు నువ్వా… నేనా అనే విధంగా ఉన్నాయి. ఓవరాల్ గా… ది వారియర్… పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్.
ఎనర్జిటిక్ రామ్ వైద్యుని పాత్రలోనూ… IPS పాత్రలోనూ బాగా వేరియేషన్స్ చూపించారు. పాటలు, యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు. అతనికి జోడీ గా నటించిన కృతి శెట్టి తో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇంట్రడక్షన్ సీన్ తోనే ప్రేక్షకుల్లో ఓ మంచి ఇంప్రెస్ క్రియేట్ చేసి… బబ్లీ క్యారెక్టర్ పాత్రను బాగా పోట్రైట్ చేశాడు. ఆది పినిశెట్టి బలమైన విలన్ పాత్రలో రౌద్రం ప్రదర్శించాడు. నదియా తల్లి పాత్ర ఒకే. డీన్ పాత్రలో సీనియర్ నటుడు జయప్రకాష్ పాత్రా పర్వాలేదు.

లింగుస్వామి రాసుకున్న కథ… కథనం వైవిధ్యంగా వుంది. దీనికి ఇంకా పదునైన సంభాషణలు రాసుకుని వుంటే సినిమా మరో రేంజ్ లో వుండేది. అలానే సెకెండ్ హాఫ్ ని రొటీన్ ఫార్మాట్ లో నడిపించాడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం చెప్పుకో దగ్గ రీతిలో లేదు. మాస్ ని మెప్పించే రెండు పాటలు ద్వితీయార్థంలో బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు.నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు.. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here