‘రుణం’ మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

0
20

స్నేహం చుట్టు అల్లుకున్న కథ… వెండితెరపై చాలా సార్లు హిట్టయింది. ఇలాంటి కథలకు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా తోడైతే ఆ బొమ్మ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడం ఖాయం. ఇలాంటి కథ… కథనాలతో తెరకెక్కిన చిత్రమే ‘రుణం’. ఎస్‌.గుండ్రెడ్డి దర్శకత్వంలో విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. మరి ఈచిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.

కథ: సుధీర్(గోపీ కృష్ణ)… శ్రీను(మహేంద్ర) ఇద్దరూ రూమ్మేట్స్. సుధీర్… లత(ప్రియ)ను బాగా ప్రేమిస్తాడు. అయితే ఆమె హ్యాండ్ ఇస్తుంది.. దాంతో మోసపోయానని తెలుసుకుంటాడు. శ్రీను కూడా సరళ (శిల్ప) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను బాగ సెటిల్ అయ్యాక వివాహం చేసుకుందాం అనుకుంటాడు. ఎలాగైనా డబ్బులు బాగ సంపాదించాలనుకుంటాడు. ఈక్రమంలో సుధీర్… శ్రీనుకు ఓ ఐడియా చెబుతాడు. శ్రీను వ్యతిరేకిస్తాడు. కానీ సుధీర్ ఒప్పిస్తాడు. వారి చేసిన పనికి వెట్రీ వీరిని వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత సుధీర్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంతకూ సుధీర్, శ్రీను చేసిన పనేంటి. వెట్రి వారిని ఏం చేశాడు. వెట్రికి సుధీర్, శ్రీనుకు ఏంటి సంబంధం… తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: ఇది  ఇద్దరి రూమ్మేట్స్ కథ. డబ్బు వారి జీవితాల్ని ఎలా మార్చిందనేది అసలు కథ. వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మానవ సంబంధాలపై రాసిన కథ. ప్రతి ఇంటిలోనూ రుణానుబంధాలు ఉంటాయి. ఈ కథ ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో కూడిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్ బాగా కంపోజ్ చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది. ఆ తర్వాత వచ్చే పబ్ సాంగ్ ట్రెండీగా ఉంది. హీరో డ్యాన్సులు ఇరగదీశాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ బాగుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య వచ్చే ట్విస్ట్ బాగుంది. శ్రీను గర్ల్ ఫ్రెండ్ సరళ ఎంట్రీ సాంగ్ బాగుంది. సరళ ఎంట్రీని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. రోడ్ దాటించే సీన్ కొత్తగా ఉంది. వీరిద్దరి మధ్య మెలోడీ సాంగ్ బాగుంది. లొకేషన్స్ బాగున్నాయి. ఆ తర్వాత స్క్రీన్ ప్లే పరంగా చిన్న ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది. ఈ చిత్రానికి డైలాగులు బాగా కుదిరాయి. డైరెక్టర్‌ ప్రతి పాత్రని చాలా చక్కగా చిత్రీకరించారు.
మరో హీరోయిన్ సీత పరిచయం సన్నివేశం కూడా బాగుంది. హీరోయిన్ ఆక్టివ్ గా ఉంది.
ముసలామెతో వచ్చే 50 రూపాయల సీన్ బాగుంది. ఎమోషనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రుణం టైటిల్ కి దర్శకుడు జస్టిఫికేషన్ బాగా ఇచ్చాడు. సుధీర్, సీత మధ్య లవ్ స్టొరీ బాగుంది. చిత్రంలో నటించిన నటీనటులందరూ వారి వారి పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు. ముఖ్యంగా కళ్లు కనిపించని పాత్రలోనటించిన తల్లితండ్రులు మంచి మార్కులు కొట్టేశారు.

ఈ సినిమాకు మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. డిఓపి కష్టం కనిపించింది. విజువల్ బ్యూటీ కనిపించింది. ప్రొడ్యూసర్‌ జి. రామకృష్ణారావు నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. డైరెక్టర్‌ ఎస్‌.గుండ్రెడ్డి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. హీరోగా చేసిన గోపికృష్ణ కథను తన భుజాల మీదేసుకొని కథను నడిపించాడు. హీరో మహేంద్ర ప్రామినెంట్ రోల్ ప్లే చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. హీరోయిన్‌ ప్రియా అందం అభినయంతో ఆకట్టుకుంది. విలన్‌ ప్రదీప్‌ పత్తికొండ విలనిజం బాగుంది. విలన్ బిల్డప్ షాట్స్ బాగున్నాయి.

చివరిగా… ‘రుణం’ మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here