తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న “సముద్రుడు”

0
55

కీర్తన ప్రొడక్షన్ పతాకంపై రమాకాంత్ , మోనాల్,అవంతిక, శ్వేతారెడ్డి హీరోహీరోయిన్లుగా విభిన్న చిత్రాల దర్శకుడు నగేష్ నారదాసి దర్శకత్వంలో బడావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సముద్రుడు” .ఈ చిత్రం ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నరదాసి మాట్లాడుతూ ” సముద్రం బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది.యాక్షన్ కి మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. కథలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దసరా తర్వాత చీరాల పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాం” అన్నారు.
చిత్ర నిర్మాత బడావత్ కిషన్ మాట్లాడుతూ ” మా డైరెక్టర్ నగేష్ గారు చెప్పిన కథ చాలా వెరైటీ గా ఉంది. మంచి మ్యూజిక్ కి స్కోప్ ఉన్న చిత్రమిది. చీరాలలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తరువాత పాటల కోసం ఫారెన్ వెళ్లనున్నాం. అన్నారు. రమాకాంత్, మోనాల్, అవంతిక, తేజారెడ్డి, సుమన్, శ్రవణ్, ముక్తర్ ఖాన్, జబర్దస్త్ శేషు, సుమన్ శెట్టి, సమ్మెట గాంధీ, గోపాల కృష్ణ, ప్రభావతి, డి. వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, ఎడిటర్:బుల్ రెడ్డి, కెమెరా:వాసు, ఫైట్స్:సతీష్, సహా నిర్మాతలు: శ్రీరామోజు జ్ఞానేస్వర్, పి.రామారావు, సోము, నిర్మాత:బడావత్ కిషన్ ,కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:నగేష్ నారదాసి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here