అలరించే ‘సవారి’

0
126

నటుడు నందు వైవిధ్యమైన కథలను ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. ఓ వైపు జయజానాకి నాయిక లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూనే మరోవైపు హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల కన్నుల్లో నీరుపమే, ఇంతలో ఎన్నెన్ని వింతలోలాంటి చిత్రాలతో అలరించిన నందు… ఇప్పుడు ‘సవారి’చేస్తా అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్. “బంధం రేగడ్” అనే షార్ట్ ఫిలిం తో 2018లో ప్రతిష్టాత్మక “సైమా” బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు అందుకున్న సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ చిత్రం ట్రైలర్, పాటలతో ఆకట్టుకొని మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.

కథ: రాజు (నందు) స్లమ్ ఏరియాలో ఉంటూ గుర్రాన్ని నడుపుకునే దిగువA తరగతి పర్సన్. తన వంశపారంపర్యంగా వచ్చే సవారి వృత్తిని చేసుకుంటూ తన జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో తన గుర్రం (బాద్షా) అంటే తనకు ప్రాణం. అయితే ఆ ప్రాణానికి ఓ సమస్య ఉంటుంది. ఆ గుర్రానికి ఉన్న సమస్యను తీర్చడానికి కష్టపడి డబ్బులు పోగేస్తుంటాడు. అలాగే భాగీ (ప్రియాంక శర్మ)ను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా ఓ రోజు బాద్షా మిస్సయ్యిపోతుంది. అలా తాను ఎంతగానో ప్రేమించే బాద్షా ఎందుకు మిస్సయ్యింది? దానికి గల కారకులు ఎవరు? అది దొరికిందా లేదా? అసలు భాగీ రాజు నఎంతగా ప్రేమిస్తోంది ? వీరి ప్రేమకు ఉన్న అడ్డు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: నటునిగా సపోర్టింగ్ రోల్స్ మరియు హీరోగా నందు ఇప్పటి వరకు చాలా సినిమాలనే చేసారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే సినిమాగా మాత్రం ఏ ఒక్కటీ అంత స్కోప్ తీసుకురాలేకపోయింది. కానీ ఈ చిత్రం మాత్రం నందు కెరీర్ కు ఆ ఇంపాక్ట్ ను ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్పాలి. ఇప్పటి వరకు స్టైలిష్ గా అనేక కోణాల్లో కనిపించిన నందు ఈ చిత్రం ద్వారా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. తన నటన ఈ చిత్రానికి మేజర్ హైలైట్ అని చెప్పాలి. అమాయక పాత్రలో కనిపించి చిన్న చిన్న మ్యానరిజమ్స్ తో తాను కనబర్చిన నటనా తీరు చాలా బాగుంది. అలాగే పలు కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సినిమా చూసే ప్రేక్షకునికి కూడా ఆ ఫీల్ ను తీసుకొచ్చే విధంగా సినిమా మొత్తం తానే నడిపించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక హీరోయిన్ ప్రియాంక శర్మ కూడా మంచి నటనను కనబర్చింది. అలాగే సినిమా అంతా మంచి పక్కా మాస్ అమ్మాయిగా కనిపించి తన చక్కని హావభావాలతో ఏ సీన్ కు ఎలా కావాలో అలా తనని తాను మలచుకున్న విధానం బాగుంది. ముందే హిట్టయిన రెండు ట్రాక్స్ నీ కన్నులు సాంగ్ మరియు ఉండిపోవా పాటలు విజువల్ గా కూడా అంతే స్థాయిలో బాగున్నాయి.

ఇంకా విలన్ రోల్ లో కనిపించిన శ్రీకాంత్ రెడ్డి ఒక పక్క విలజనిజం మరో పక్క దానితోనే కామెడీ యాంగిల్ బాగా క్యారీ చేసారు.అతనికి మరియు అతని గ్యాంగ్ మధ్య వచ్చే ప్రతీ కామెడీ ట్రాక్ బాగుంది. దీనిని దర్శకుడు బాగా ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన శివ కుమార్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.
ముందుగా చెప్పుకున్నట్లుగానే దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. కామెడీ అండ్ లవ్ సీక్వెన్స్ లో మరియు క్లైమాక్స్ అండ్ కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. మొనీష్ భూపతిరాజు కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ఎడిటర్ గా పనిచేసిన సంతోష్ మేనం పనితనం కూడా ఆకట్టుకుంది. నిర్మాతలు సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి నిర్మాణ విలువులు బాగున్నాయి.
‘సవారి’ అంటూ బోల్డ్ స్లమ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా…. కొన్ని కామెడీ సన్నివేశాలతో అలరించాయి… క్లైమాక్స్ అలాగే కొన్నిచోట్ల డైలాగ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో సినిమా బాగా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here