సెవెన్ మూవీ టిజర్ రివ్యూ : చాలా ఆసక్తికరమైన కధాంశం. టిజర్ అదిరింది గురు.

0
40

ఈ మధ్య విడుదల అయి మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ సినిమా మీదనే హైప్ పెంచుతున్న టిజర్ 7 మూవీ ది.
ఒక్కడున్నాడు, ఉన్నాడో లేదో తెలియదు, ఉన్నాడనే అంటున్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఇంకా ఎంత మంది? అందరిని ముడి వేసిన ఒకే ఒక ప్రశ్న వాడు..! సమాధానము వాడే..! ఏవడు వాడు..? ఎక్కడ ఉంటాడు? ఎం చేస్తున్నాడు..? అంటూ మనకు ఈ మూవీ టిజర్ లో వినిపించిన ప్రతి డైలాగ్, కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ సినిమా స్థాయిని పెంచేసాయి. హాట్ లిప్ కిస్ లు, యూత్ ని ఉహల్లో నిలిపే రొమాంటిక్ సీన్లు, మర్డర్ బ్యాక్డ్రాప్ స్క్రీన్ ప్లే, ముద్దు గుమ్మల అందాలు ఇవన్నీ టిజర్ కట్ ని అదిరిపోయేలా చేశాయి. బ్యాకగ్రౌండ్ మ్యూజిక్, RX 100 తో తెలుగు చిత్ర పరిశ్రమకు బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అందించిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తుండటం మరో ప్రత్యేకత. అలాగే రమేష్ వర్మ అందిస్తున్న కథ స్క్రీన్ ప్లే, కె.ఏల్ ప్రవీణ్ ఎడిటింగ్, శ్రీమణి సాహిత్యం ఇలా ఈ సినిమాలో ప్రతిది గొప్పగా చెప్పుకోదగినదే. రెజినా, అదితి ఆర్య, నందితా శ్వేతా, పూజిత పొన్నాడ, అనిశా అమ్బ్రోష్, రహమాన్, హవిష్ మరియు త్రిధా చౌదరి లు నటిస్తున్న ఈ సినిమా టిజర్ ఇప్పుడు యుట్యూబ్ లో సంచలనాలు సృద్తిస్తుంది అనే చెప్పాలి. రమేష్ వర్మ నిర్మాత గా, నిజార్ షఫీ దర్శకుడిగా తెలుగు మరియు తమిళ భాషలలో భారి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది మన సెవెన్ చిత్రం. టిజర్ ఏ ఈ స్థాయిలో ఉంటే, ఇంక సినిమా పై ప్రేక్షకులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటారో చూద్దాం మరి. ఏది ఏమైనా సరికొత్త కధాంశం మన ముందుకు రానున్న ఈ (7) సెవెన్ చిత్రం భారి హిట్ కొట్టేలానే కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here