ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా `శంక‌ర్ ప‌హిల్వాన్’

0
439

మైటీ మూవీస్  ప‌తాకంపై  ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఎ.ఎ.ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో అబ్దుల్ అజీమ్ ,  మిర్జా అబిద్ హుస్సేన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `శంక‌ర్ ప‌హిల్వాన్‌`.  త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత‌లు మాట్లాడుతూ…“కీర్తి శేషులు శ్రీహ‌రి సోద‌రుడు శ్రీధ‌ర్ హీరో ష‌క‌ల‌క శంక‌ర్ కు తండ్రి పాత్ర‌లో ప‌హిల్వాన్ గా న‌టిస్తున్నాడు. అలాగే విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు క్రోసూరి మ‌ణి, కాదంబ‌రి కిర‌ణ్   ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒక విలేజ్ లో కుస్తీ పోటీల నేప‌థ్యంలో  సాగే ఈ  చిత్రాన్ని త్వ‌ర‌లో గ్రాండ్ గా ప్రారంభించ‌నున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్ః బాబా;  కాస్ట్యూమ‌ర్ః సుబ్బ‌య్య‌; స్టిల్స్ః బాబు;  ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః మ‌ల్లిక్‌;  సినిమాటోగ్ర‌ఫీః సుధాక‌ర్ నాయుడు;  ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌;  డాన్స్ః గ‌ణేష్‌;  మాట‌లుః చంద్ర‌శేఖ‌ర్. జి (పిల్ల జ‌మిందార్‌), మూలకథ:అబ్దుల్ అజీమ్, విక్ర‌మ్ రాజ్‌; నిర్మాత‌లుః అబ్దుల్ అజీమ్‌, మిర్జా అబిద్ హుస్సేన్‌;   క‌థ‌-స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వంఃఎ.ఎ.ధ‌నుష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here