శంకర్ హీరోగా కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో సురేష్ కొండేటి , ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘2+1’

0
58

శంకర్ హీరోగా కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ .కె. పిక్చర్స్ , ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా సురేష్ కొండేటి , ఎడవెల్లి వెంకట్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం 2+1 ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను దసరా కానుకగా మరియు ప్రముఖ నిర్మాత సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా ఆరవ తేది ఆదివారం (రేపు) విడుదల చేస్తున్నారు.

ఈ సందర్బముగా చిత్ర దర్శకులు కాచిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ :- అన్ని వర్గాల ప్రేక్షకులను అకట్టుకునే అంశాలతో శంకర్ ను , రెండు విభిన్నమయిన పాత్రలతో ఈ సినిమాలో చుపించబోతున్నాము ముఖ్యంగా మాస్ క్యారెక్టర్ తో పాటుగా క్లాస్ టచ్ ఉన్న స్టూడెంట్ పాత్రలో కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. మరో పది సంవత్చరాల పాటు గుర్తుండిపోయే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు ఈ సినిమాలో శంకర్ పోషించారు. దర్శకుడిగా నా మొదటి సినిమాకు శంకర్ లాంటి మంచి హీరో దొరకడం ,ప్రతిస్టాత్మకమైన ఎస్ .కె. పిక్చర్స్ సంస్థ సురేష్ కొండేటి గారు నూతన నిర్మాణ సంస్థ ఆకృతి క్రియేషన్స్ ,ఎడవెల్లి వెంకట్ రెడ్డి గార్లు నన్ను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం నా అదృష్టం” అన్నారు .
హీరో శంకర్ మాట్లాడుతూ ” నన్ను కొత్త యాంగిల్ లో చూపించబోతున్న దర్శకుడు గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మల్లి శంభో శంకర సినిమా తర్వాత ఎస్ .కె. పిక్చర్స్ బ్యానర్ లో సురేష్ కొండేటి గారితో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మంచి ప్రొడక్షన్ వాల్యూతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నా కేరియర్ లో బెస్ట్ సినిమాగా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నూతన నిర్మాణ సంస్థ ఆకృతి క్రియేషన్స్ ఎడవెల్లి వెంకట్ రెడ్డి గారు సహకరించడం సంతోషంగా ఉంది” చెప్పారు .
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ “శంకర్ తో శంభో శంకర తర్వాత మల్లి భారీగా ఐదు యాక్షన్ ఎపోసోడ్స్ తో పాటు నాలుగు అద్భుతమయిన పాటలతో కడుపుబ్బ నవ్వించే కామెడి సీన్స్ తో నిర్మితమౌతున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. థియేటర్ కు వచ్చి నూటికి నూరుశాతం సాటిస్ఫ్యాక్షన్ అయ్యేవిదంగా దర్శకుడు గోపాల్ రెడ్డి గారు తీర్చిదిద్దుతున్నారు.భవిష్యత్తు లో ప్రూవ్ చేసుకుంటాడని మంచి సినిమాలు చేస్తాడని నాకు నమ్మకంఉంది” అన్నారు.
మరో నిర్మాత ఎడవెల్లి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “సురేష్ కొండేటి గారితో కలిసి సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.ఒక టీం వర్క్ తో అందరు హ్యాపీగా పనిచేస్తున్నారు.మా ఈ కష్టానికి ప్రతిపలంగాప్రేక్షకులు అఖండ విజయాన్ని చేకురుస్తారని కోరుకుంటున్నాను.ఇప్పటి వరకు 80% సినిమా పూర్తయింది. తర్వాత ప్రారంబించబోయే 20% షెడ్యుల్ మూడు పాటలు కొన్ని సన్నివేశాలు చిత్రికరిస్తాము.దీనితో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది” అన్నారు.
ఈ సినిమాలో హీరో హీరోయిన్ లుగా శంకర్ ,రుబికా,ఆక్సాఖాన్ నటించారు. ఈ చిత్రానికి కథ ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: కాచిడి గోపాల్ రెడ్డి ప్రొడ్యూసర్స్ : సురేష్ కొండేటి , ఎడవెల్లి వెంకట్ రెడ్డి, డిఓపి: మొటం సతీష్ , సంగీతం : హరిగౌర ,ఎడిటర్ : నందమూరి హరి ,డైలాగ్స్ : పటేల్ నందుర్క ,లిరిక్స్ :సురేష్ ఉపాద్యాయ ,ఆర్ట్ డైరెక్టర్ :రాజు అడ్డాల ,కో డైరెక్టర్ : నాగేంద్ర ఒడిస్సా ,ఛీప్ అసోసియేట్ : కొక్కు నరసింహ రావు కాస్ట్యూమ్ డిజైనర్: అలూరి నీరజ , కొరియోగ్రాఫర్ : రాజు పైడా, ఫైట్స్: పృథ్వి, ప్రొడక్షన్ కంట్రోలర్ : రామ్మోహన్ అల్లూరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here