లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘శివన్’

0
63

కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు.. క్రైమ్ డ్రాను జోడించిన కథలను వెండితెరపై ఆవిష్కరిస్తే.. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకే దర్శకులు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ను సింపుల్ లైన్ తో తెరకెక్కించి విజయం సాధించిన సంధర్భాలు ఎన్నో వున్నాయి. తాజాగా కల్వకోట సాయితేజ – తరుణీ సింగ్ జంటగా ఎస్.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. సంతోష్ రెడ్డి లింగాల నిర్మించిన లవ్ థ్రిల్లర్ తో పాటు క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘శివన్. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. మరి ఈ చిత్రం ప్రేక్షుకులను ఎంతవరకు అలరించిందో చూద్దాం పదండి.

కథ: శివన్ (కల్వకోట సాయితేజ) చిన్నప్పుడే తన తల్లిని కోల్పోతాడు. దాంతో అతనికి సునంద (తరుణీ సింగ్) దగ్గరవుతుంది. వాళ్లతో పాటు వాళ్ళ ప్రేమ కూడా పెరుగుతూ వస్తోంది. అల హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ లైఫ్ లో ఒక యాక్సిడెంట్ సునందను అనాథను చేస్తోంది. దాంతో శివన్, సునంద బాధను పోగొట్టడానికి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇద్దరూ ఎంతో సంతోషంగా పెళ్లి కోసం బయలుదేరతారు. దారిలో ఉన్నట్టు ఉండి శివన్ ఒక్కసారిగా మారిపోయి.. సునందను దారుణంగా చంపేస్తాడు. అంతగా ప్రేమించినవాడు ఎందుకు ఆమెను చంపాడు ? ఒక్కసారిగా అతనికి ఏమైంది ? చంపింది అతనే ఆయన.. అతనికి తెలియకుండానే ఏదో శక్తి అతని చేత ఈ పని చేయించిందా ? ఇంతకీ ఆ శక్తి ఏమిటి ? చివరికీ శివన్, సునంద కోసం ఎలా మారిపోతాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: రొటీన్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించాలంటే కథలో గానీ.. ట్రీట్ మెంట్ లో గానీ కొత్తదనం వుండాలి. అప్పుడే ఆడియన్స్ సినిమాకు ఆకర్షితులవుతారు. అందుకే నిర్మాతలు గానీ.. దర్శకులు గానీ.. హీరోలు గానీ.. కొత్త కథలకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలను నిర్మిస్తున్నారు. అలాంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. తాజగా ‘శివన్’ సినిమా కూడా అలాంటి వైవిధ్యమైన కథ.. కథనాలతో తెరకెక్కిందే. వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో.. హీరోగా నటించిన సాయితేజ చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్నిఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన తరుణీ సింగ్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ గా నటించిన నటుడు కూడా చాల బాగా నటించాడు.
అలాగే హీరో ఫ్రెండ్ మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు శివన్ తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది. సెకెండ్ హాఫ్ లో ఆయన రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీన్స్ మరియు విలన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిస్తోంది. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని ముగించడం కూడా పర్వాలేదు.

సినిమాకి సాంకేతిక విభాగం వర్క్ బాగా ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా వున్నాయి. దర్శకుడు శివన్ మంచి కథాంశం తీసుకున్నారు. ఉత్కంఠభరితమైన కథనాన్ని తెరకెక్కించి… ప్రేక్షకుల్ని అలరించారు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్లు శివన్ ను ఓ సారి చూసేయొచ్చు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here